మక్తల్ టౌన్/కృష్ణ, మే 9 : కాంగ్రెస్ అధికారం చే పట్టిన ఐదు నెలల్లోనే రైతాంగం ఆగమైందని.. దొంగ హామీలిచ్చిన సర్కారుకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పే ర్కొన్నారు. బీఆర్ఎస్ పాలమూరు ఎంపీ అభ్యర్థి మ న్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా గురువారం మండలంలోని ముడుమాల్, చేగుంట, గుడెబల్లూరు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రా మాల ప్రజలు చిట్టెం వద్దకు వచ్చి కాంగ్రెస్ పాలనలో ఎదురొంటున్న సమస్యలను వివరించారు.
కాంగ్రెస్‌కు ఓటేసినందుకు తమకు తగిన బుద్ధి చెప్పారని గోడు వెళ్లబోసుకున్నారు. వారి మాటలు విన్న చిట్టెం మాట్లాడుతూ.. మన్నెను గెలిపిస్తే కాంగ్రెస్ పరిపాలనను ఎండగట్టేందుకు వీలుంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్, నీటి కష్టాలొస్తాయని ముందే తెలుసునన్నారు. ముడుమాల్‌లో ఉపాధి ప నులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లగా.. కాంగ్రెస్‌కు ఓ టేసి మోసపోయాం.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకే మా ఓటంటూ.. సమాధానమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు శివరాజ్‌పాటిల్, మోనేశ్, శివప్ప, శంకర్ నాయక్, కృష్ణ, చెన్నయ్యగౌడ్, సంతోష్, సురేశ్, శివ ప్ప, వెంకటేశ్, తిమ్మప్ప, అమ్రేశ్, అశోక్‌గౌడ్, వెంకటేశ్, బాలప్ప, రాఘవేంద్ర, హనుమంత్‌రెడ్డి, కార్యక ర్తలు, నాయకులు పాల్గొన్నారు.