మక్తల్, జూన్ 21 : వానకాలం సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం సహకారం ఉం టేనే కొనుగోలు చేస్తామంటూ ముందస్తుగా కాంగ్రె స్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నా రు. ఆదివారం మక్తల్‌లోని ఆయన నివాస గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ.. గతంలో నల్ల చట్టాలు తీసుకువచ్చి ప్ర ధానమంత్రి నరేంద్ర మోదీ 700కు పైగా రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు.
ప్రధానమం త్రి బాటలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తూ.. కేంద్రం సహకారం ఉంటే తప్ప రాష్ట్రం లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందనడం సిగ్గుచేటని ఆయన ఆ రోపించారు. రేవంత్ రెడ్డి రైతులను నట్టేట ముంచడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నా రు. కేంద్రం రైతుల ధాన్నాన్ని కొనకపోతే.. రాష్ట్ర ప్ర భుత్వమే రైతులు పండించిన ప్రతి గింజనూ కొనేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వానకాలం సీజ న్ ప్రారంభం దశలోనే రైతుల నుంచి ప్రభుత్వం వ డ్లు కొనలేదని ప్రకటనలు చేస్తూ.. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం రైతులను భయబ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వ పాలనలో రైతులకు సాగునీరు అందించడంతోపాటు, రైతుబంధు పథకంతో ప్రతి రైతుకూ ఎకరాకు రూ.6వేలు చొప్పున పెట్టుబడి సాయం అందజేశారని గుర్తు చేశారు. 20 23 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చి న హామీలను నిలబెట్టుకోలేని దద్దమ్మ ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యం తో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిచేసి భీమా ప్రాజెక్టు ద్వారా సా గునీరు అందించారన్నారు. దీంతో మక్తల్ నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాల్లో రైతులు పచ్చటి పంటలు పండిస్తున్నారని చెప్పారు.
ప్రస్తుతం కాంగ్రె స్ ప్రభుత్వం పాలనలో భీమా ప్రాజెక్టులో పంప్‌హౌస్‌లను ఎవరు పడితే వారు మోటర్లను ఆన్ చే స్తూ, మోటర్లను పాడు చేసే పని చేస్తున్నారని ఆరోపించారు. మక్తల్ నియోజకవర్గంలోని భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్‌కు నీటిని తీసుకు వెళ్లడానికి ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రాజెక్టుకు, డీపీఆర్ లేదని, కనీసం ఏడు టీఎంసీల నీటిని ఏవిధం గా తీసుకువెళ్లాలని ఆలోచన కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేకుండా ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో తొండలుగుడ్లు పెట్టని భూ మి అని ముఖ్యమంత్రి అవహేళన చేశారని, ప్రస్తు తం రూ.3వేల కోట్లతో తొండలు కూడా పాకని భూ మికి ముఖ్యమంత్రి వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి లగచర్ల వరకు ప్రత్యేకంగా రోడ్డు వేయడమేంటని ప్ర శ్నించారు. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీ తమ సొంత గ్రామమైన కొం డారెడ్డిపల్లి అభివృద్ధి కోసమే చేపడుతున్నారని పేర్కొన్నా రు.
మక్తల్ నియోజకవర్గంలో ప్రభుత్వం ఇసుక మాఫియాపై దృష్టి పెట్టి, ఇసుక మాఫియా నియంత్రణలను అణగదొకకపోతే, బీఆర్ఎస్ ఆధ్వర్యం లో ఏం చేయడానికి ఆయినా సిద్ధంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హెచ్చరించా రు. మంత్రి వాకిటి శ్రీహరి మత్స్య శాఖా అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు చిన్నఅనుమంతు, అన్వర్ హుస్సేన్, నా రాయణరెడ్డి, వసంతగౌడ్, శంకర్, మైముద్, సాగ ర్, నర్సింహారెడ్డి, అమ్రేశ్, ఈశ్వర్ యాదవ్, రఘు, అశోక్ గౌడ్, వినోద్ పాల్గొన్నారు.
సెలవు రోజుల్లో ఇసుక తవ్వకాలేంటీ?
మాగనూర్, జూన్ 21 : సెలవు రోజుల్లో కూడా హిటాచి పెట్టి ఇసుక తవ్వకాలు నిర్వహించడం ఏమిటని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగులో ఇసుకను తోడుతున్న రాఘవ కన్స్ట్రక్షన్ కం పెనీకి చెందిన వాహనాలను ఆదివారం మక్తల్ మా జీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అడ్డుకున్నారు. అనంతరం మాగనూర్ తాసీల్దార్‌కు ఫోన్ చేసి మా ట్లాడారు. సెలవుల రోజుల్లో పట్టపగలు అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారని తాసీల్దార్‌ను ప్రశ్నించాగా.. ‘మన ఇసు క మన వాహనం’ ద్వారా అనుమతులు ఉన్నాయని తాసీల్దార్ సమాధానం ఇచ్చారు.
అయితే మన ఇసు క మన వహనం నిబంధలు మీకు తెలీదా అని తాసీల్దార్‌ను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. మన ఇసుక మన వహనం నిబంధనల ప్రకారం వాగులో హిటా చి పెట్టకుండా వాగులో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ట్రాక్టర్ల ద్వారా ఒడ్డుకు ఇసుకను వేసి అక్క డి నుంచి ట్రిప్పర్ల ద్వారా ఇసుకను తరలించాలన్నా రు. అంతేకాని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి అయినంత మాత్రానా ప్రభుత్వ నిబంధనలు తుంగ లో తొక్కుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇసుక తరలింపు జరగాలని, లేకపోతే ఇసు క రవాణాను బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్డుకుంటామని తాసీల్దార్‌ను హెచ్చరించారు. ఆయన వెం ట మక్తల్, మాగనూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.