పానగల్ : గద్వాల జిల్లా కేంద్రంలో నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నర్సింగ్ విద్యార్థి మనిషా శ్రీ కుటుంబాన్ని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే (Former MLA) బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Beeram Harshavardan Reddy ) పరామర్శించారు. బుధవారం హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ నియోజక వర్గం పానగల్ మండలం రాయినపల్లి గ్రామానికి వచ్చి మనిషాశ్రీ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు (Tribute) .
అత్యంత పేద కుటుంబంలో పుట్టి పేదవారికి వైద్య సేవలు అందించాలని దృడ సంకల్పంతో చదువుకునేందుకు ఆర్థిక సోమత లేకపోయినా కష్టపడి చదువుతున్నా విద్యార్థిని మానిషాశ్రీ అకాల మరణం తన మనసును కలచివేసిందని అన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ 10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఇల్లు లేని బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంతో భవిష్యత్ ఉండి పేదవారికి వైద్య సేవలు చేయాలని తపనతో ఉన్న ఇద్దరు విద్యార్థినీలు మృతి చెందడం కలవరపరిచిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు.