కొత్తకోట, డిసెంబర్ 15 : పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యూఆర్ ఫంక్షన్ హాల్లో పట్టణ, మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం నిర్వ హించిన సమావేశం లో పాల్గొని మాట్లాడారు. 2014లో మ న సైన్యం లేకున్నా కసితో పనిచేసి గెలుపొందామని, పదేండ్లపాటు ప్రజల కో సం నిరంతరం సేవ చేశానని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు అమూల్యమైందని, అలసత్వం వల్లే ఓటమి పాలయ్యామన్నారు. జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని, గెలుపు పోటములు సహజమేనన్నారు. నమ్మక ద్రోహం చేసే వారు పార్టీ విడిచి వెళ్లాలని, అలాంటి వారిని ఉపేక్షించమన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. మనం చేసిన పనులు గెలిపించేవి అని కొం దరు ఆశ్రద్ధ చేయడం తో ఓడామన్నా రు. ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జీవితాంతం కార్యకర్తల కోసం పనిచేస్తారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స ర్పంచులు వంద కు వందశాతం బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందాలన్నారు. ఇప్పటి నుంచే కార్యచరణ రూ పొందించుకోవాలని అందుకు తగ్గ ట్లు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.
మండలంలోని కానాయపల్లి గ్రామానికి చెందిన నక్కల రాములు రోడ్డు ప్రమా దంలో గాయపడి యశోద దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెం దారు. రాములు అవయవాల దానం చేసి నలుగురికి ప్రాణదానం చేశారు. చికిత్స నిమిత్తం రూ. 2.50లక్షల ఖర్చు కాగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాఫీ చేయించారు. శుక్రవారం కానాయపల్లిలో జరుగుతున్న అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈదులాబాయి తండా గ్రామానికి చెందిన సర్పంచ్ లక్ష్మణ్‌నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో జె డ్పీవైస్ చైర్మన్ వామన్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, సీడీసీ చైర్మన్ చెన్నకేశ వరెడ్డి, ఎంపీపీ గుంతమౌనిక, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జయమ్మ, విశ్వేశ్వర్, ప్రశాంత్, బాలకృష్ణ, అయ్య న్న, బాబురెడ్డి, ప్రసన్నలక్ష్మి, పద్మ, సంధ్య, రాములు యాదవ్, తిరుపతయ్య, నాగన్నసాగర్, ఖాజమైనుద్దిన్, శ్రీనూజీ పాల్గొన్నారు.
కొత్తకోట, డిసెంబర్ 15 : అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన విషయం విధితమే . అయితే శుక్రవారం పట్టణంలోని ముఖ్య కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి సమావేశంలో నిర్వహించగా పలువురు నాయకులు, మహిళలుభావోద్వేగానికి గురై కంట తడపెట్టారు. వీరిని చూసి మాజీ ఎమ్మెల్యే ఆల సైతం భావోద్వేగానికి గురయ్యారు.