భూత్పూర్, ఆగస్టు 14 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మద్దిగట్ల గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి ఇంట్లో ప్రత్యేకంగా కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, కార్యకర్తలంతా సమన్వయం తో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పార్టీ బలంగా ఉంటేనే నాయకులు గెలిచేందుకు అవకాశం ఉంటుందన్నారు.
గ్రామాల్లో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు బాలకోటి, రామకృష్ణ, అజీజ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, సత్తూర్ నారాయణగౌడ్, చెన్నయ్య, గడ్డం రాములు ఉన్నారు.