భూత్పూర్, మే 28 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ సిరి న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ తీవ్ర ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతుండగా పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
వైద్యులు శస్త్ర చికిత్స అవసరమని తెలిపారు. దాంతో ఆయన స్పందించిన ఆయన.. శంకర్ నాయక్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.లక్ష అందజేయగా.. వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ బాలకోటి రూ.25వేలు, రాము రాథోడ్ రూ.5వేలు, భట్టుపల్లి మాజీ సర్పంచ్ ఆంజనేయులు రూ.5వేలు, కరివెన మాజీ ఉపసర్పంచ్ బాల్ రెడ్డి రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. శంకర్ నాయక్ కుటుంబానికి తనను స్ఫూర్తిగా తీసుకొని టీఆర్ఎస్ నాయకులు అందజేయడంపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కాపాడుకోవడం తన ప్రథమ కర్తవ్యమన్నారు.