మదనాపురం, ఏప్రిల్ 7 : బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని దేవరకద్ర మాజీ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. కొన్నూరు గ్రామంలో దే వరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జ యంతి నివాసంలో ఏర్పాటు చేసిన గ్రామస్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ ఆపద సమయంలో పార్టీ కోసం నిలబడ్డ కార్యకర్తలే తనకు ముఖ్యమని, నాయకులు వస్తూ పోతూ ఉంటారని అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం మ నకు లేదన్నారు.
అందరూ తనవాళ్లే అని నమ్మి త ప్పుచేశానని, పదవులు అనుభవించి, పార్టీ ఓటమి పాలుకావడంతో, తమ ఉనికి కోసం ఇతర పార్టీలకు వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఇకపై పార్టీ కోసం నిలబడిన వారికే తొలిప్రాధాన్యత ఉంటుందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తాచాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మండలంలోని తిర్మలాయపల్లికి చెం దిన సీనియర్ కార్యకర్త తిమ్మన్న ఇటీవలే మృతి చెం దగా విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం బా ధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. తి మ్మన్న కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం ద్వారా తమ ఖాతాలో రూ.5లక్షలు జమ అయ్యాయని, జీవితాంతం కేసీఆర్‌కు రుణప డి ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకు లు అచ్యుతారెడ్డి, అర్చన, శ్రావణి, శారద, మహేశ్, మా సన్న, విజయేందర్‌రెడ్డి, రవికుమార్ మురళి, గోవర్ధన్, నర్సింహ, గాంధీనాయక్ పాల్గొన్నారు.