పాలమూరు, ఫిబ్రవరి 25 : జిల్లా కేంద్రంలోని సింహగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, అభిషేకం, ప్రత్యేక అలంకరణ చేశారు. బ్రహ్మోత్సవాలకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరై స్వామికి కలషాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 కలశాలకు అర్చకులు వేదమంత్రాలతో పూజలు చేశారు.
మహబూబ్‌నగర్‌టౌన్, ఫిబ్రవరి 25 : గతంలో బాడీబిల్డింగ్ పోటీలు ఫంక్షన్‌హాల్స్‌లో జరిగేవని, కేసీఆర్ సర్కార్‌లో పదేండ్లలోనే పాలమూరును క్రీడల్లో అన్నివిధాలా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో ని ఇండోర్ స్టేడియంలో షఫీసామి బాడీబిల్డింగ్ మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలు ప్రారంభించారు.
జడ్చర్ల, ఫిబ్రవరి 25 : జడ్చర్ల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శకటోత్సవం(బండ్లు) నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్లతోపా టు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివ చ్చి స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. గో వింద నామస్మరణతో జాతర ప్రాంగణం మా ర్మోగిం ది. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 25 : మండలంలోని ఎక్లాస్పూర్ తిమ్మప్పస్వామి జాతరను ఆదివారం వైభవంగా నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య రథోత్సవం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రథాన్ని లాగారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
మరికల్, ఫిబ్రవరి 25 : మండలంలోని ఎక్లాస్పూర్ స్టేజీ వద్ద వెలిసిన లక్ష్మీనర్సింహ్మస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. పంచామృతాభిషేకం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.