శ్రీనివాస్‌గౌడ్ పాలమూరు నుంచే పోటీ చేస్తారు
నిరంతరం మహబూబ్‌నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చివరి రక్తబొట్టు వరకు మహబూబ్‌నగర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు స్పష్టం చేశారు.
- యూటీవీ స్టోరీపై పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
మహబూబ్‌నగర్, జూలై 12 : నిరంతరం మహబూబ్‌నగర్ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చివరి రక్తబొట్టు వరకు మహబూబ్‌నగర్ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు స్పష్టం చేశారు. మాజీ మంత్రిపై ఆసత్య వీడియోను యూట్యూబ్‌లో యూటీవీ స్టోరీపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ అప్పయ్యకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ శ్రీనివాస్‌గౌడ్ పాలమూరును వదిలి శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్‌కు వెళ్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి పక్షాన పోరా టం చేస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారన్నారు. బీసీలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నందుకే కుట్ర జరుగుతోందా? అనే అనుమానం కలుగుతుందని అన్నారు. కనీస ఆధారాలు లేకుండా కేవలం ఆయన ప్రతిష్టను విశ్వసనీయతను దెబ్బతీయాలనే దురద్దేశంతోనే ఈ అవాస్తవ వార్తలు ప్రచురించారని పేర్కొన్నారు.
కనీసం జర్నలిస్టు విలువలు పాటించకుండా, శ్రీనివాస్‌గౌడ్ వివరణ కోరకుండా వార్త ప్రసారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి తప్పడు కథనాన్ని , దానికి సంబంధించిన డిజిటల్ లింక్‌లను తక్షణమే తొలగించాలని కోరారు. సోషల్ మీడియాలో అకౌంట్స్‌లో వీడియో పెట్టారని వెంటనే దానిని తొలగించాలని, తప్పుడు వార్త ను సామాజిక మాధ్యమాల్లో పెడితే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీనిపై విచారణ చేసి బా ధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో కార్పొరేటర్ నవకాంత్, సీనియర్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, సుధాకర్, అప్సర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

