మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, ఆగస్టు 22 : రుణమాఫీ కోసం మహిళా రైతులు పోల్కంపల్లి అంజిల మ్మ, దాసర్పల్లి వెంకటమ్మ గురువారం మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్ యూనియన్ బ్యాంక్‌కు వచ్చా రు. మాఫీ గురించి అడిగితే అధికారులెవరూ స్పందించకపోవడంతో బ్యాంక్ వద్ద దిగాలుగా కూర్చున్నారు.
అటుగా వెళ్తూ గమనించిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ వారిని పలుకరించగా, వారు కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాన్ని నమ్ముకొని బతికేటోళ్లం బిడ్డా.. రుణమాఫీ అంటూ ఆశపెట్టి మాకు కాకుండా చేసిండ్రు అం టూ వాపోయారు. పింఛన్ కూడా ఇస్తలేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మాజీ మంత్రి వారిని ఓదా ర్చి బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. వారి సమస్య ఏంటో తెలుసుకొని పరిష్కరించాలని కోరారు.
నాపేరున 1.35 ఎకరాల భూమి ఉంది. బ్యాంక్‌లో రూ.30వేలు రుణం కట్టాల్సి ఉం ది. ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకంలోనూ నా పేరు సరిగానే ఉంది. బ్యాంక్ బుక్కులో మా నాయిన యాదయ్య పేరు త ప్పుగా ఉందని, అందుకే రుణమాఫీ కాలేద ని చెబుతున్నారు. తప్పువారిదైతే శిక్ష మా కెందుకు. రుణం ఇచ్చేటప్పుడే ఈ తప్పుల గురించి చెప్పేదుండే. కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలి.
– కర్రె రాములు, మునిమోక్షం, హన్వాడ మండలం
హన్వాడ కో ఆపరేటివ్ సొసైటీలో 401 మంది రైతులకు రూ.2.45కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కానీ అధికారులు కేవ లం 220 మందికి రూ.1.10కోట్లు మాత్ర మే మాఫీ చేస్తామని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం. అందరికీ సమన్యాయం చేయాలి. అర్హులకు కూడా మాఫీ చేయకుంటే ఎట్లా.
– కరుణాకర్‌గౌడ్, బుద్ధారం, హన్వాడ మండలం