మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 12 : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు మా ప్రాంతం కర్ణాటక మాదిరిగానే ఉండేదని, కేసీఆర్ అధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ద్వారా రాష్ట్రం సాధించుకొని కులవృత్తులతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కుల వృత్తుల పునరుద్ధరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కులవృత్తుల పునరుద్ధరణ కోసం కర్ణాటకలో ప్రణవానందస్వామి ఆధ్వర్యంలో సేడం నుంచి బెంగళూర్ వరకు 700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి గురువారం బెంగళూర్‌లోని ఫ్రీడం పార్కులో నిర్వహించిన ముగింపు సమావేశానికి మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
కర్ణాటక రాష్ట్రం తరఫున ఆ రాష్ట్ర బీసీ శాఖ మంత్రి శివరాజ్ తంగడిగికు బీసీల డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశా రు. అనంతరం మాట్లాడుతూ కర్ణాటక విధానసభ ప్రాంగణంలో నారాయణ గురు విగ్ర హం ఏర్పాటు చేసి ట్రస్ట్‌కు రూ.500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. తెలంగాణ తరహా కర్ణాటక రాష్ట్రంలో కూడా వైన్స్ షాప్‌ల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. కర్ణాటకలోని మంగ ళూర్, బెంగళూర్, గుల్బర్గా ప్రాంతాల్లో అభివృద్ధి ఒక్కోక్క విధంగా అమలు చేస్తున్నారు.
అలా కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధ్ది చే యాలని సూచించారు. పదేళ్లల్లో రాష్ట్రంను అ న్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్ణాటక భూములు రెట్టిం పు అయ్యే విధంగా సంపద పెంచామన్నారు. హైదరాబాద్‌లోనూ తెలంగాణ ప్రాం తాలైన కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, బీదర్, రాయిచూర్, యాదగిరి, కొప్పల్, బళ్లారి, విజయనగర జిల్లాలో వ్యవసాయం, కులవృత్తులు వెనుకబడాయని ఆ ప్రాంతాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో మాజీ మంత్రి మలకయ్య గుత్తేదార్, మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ ఉన్నారు.