మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 26 : ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారని, ఆ నిరసన దీక్షనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సూచించిందని మా జీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీక్షా దివస్ సన్నాహక కార్యక్రమం లో భాగంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 29న జిల్లా కేంద్రం బస్టాండ్ సమీపంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే దీక్షాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు పిలు పునిచ్చారు. కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షతోనే కేంద్రం కదిలి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి పదేండ్లలో దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా నిలిపిందని వివరించారు.
ఉద్యమ సమయంలో అనేక బెదిరింపులు వచ్చినా వె నక్కి తగ్గకుండా పోరాటం చేశామని గు ర్తు చేశారు. ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి 14ఎఫ్కి వ్యతిరేకంగా ఉద్యోగులు పో రాటం చేస్తుంటే కేసీఆర్ పిలుపించుకొని మద్దతు తెలిపారన్నారు. 14ఎఫ్ రద్దు కోసం సిద్దిపేట సభలో ఏర్పాటు చేస్తే అ క్కడే ఆమరణదీక్ష చేస్తామని కేసీఆర్ ప్రకటన చేశారన్నారు. తెలంగాణ ప్రకటన వచ్చే వరకు దీక్ష విరమణ చేయనని కేసీఆర్ చెప్పగా.. ప్రకటన వచ్చిన తర్వాత మా చేతులమీదుగా దీక్ష విరమణ చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం మరుపురాని ఘట్టం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.50 పింఛన్, కరెంట్ లేక రైతుల ఆత్మహత్యలు ఉండేవని, రాష్ట్రం సాధన అనంతరం కేసీఆర్ సారథ్యంలో కరెంట్, పంట సాగు, మంచి నీళ్లు, రెం డువేల పింఛన్ ప్రజలకు అందించి పదేండ్లల్లో రా ష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధ్ది సాధించిందనన్నారు. భవిష్యత్‌లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీ మా వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
కామారెడ్డి వేదికగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సరైన రిజర్వేషన్లు కల్పించలేదని.. ములుగు జిల్లాలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలే, పాలమూరు జిల్లా హన్వాడ, టంకర వంటి గ్రామ పంచాయతీలో అత్యధిక బీసీలు ఉన్నపటికీ బీసీ రిజర్వేషన్లలో ప్రాధాన్యం కల్పించలేదని ఆరోపించారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ మా జీ చైర్మన్ ఇంతియాజ్, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, జెడ్పీ వైస్ మాజీ చైర్మన్ యాదయ్య, భూత్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సుధాకర్, జంబులయ్య పాల్గొన్నారు.
స్థానిక సం స్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి నా యకుడు, కార్యకర్త పనిచేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. బు ధవారం జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ఎన్నికలకు వెళ్లిందన్నారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు కూ ర్చొని పార్టీ తరఫున గెలిచే అభ్యర్థిని బరి లో నిలుపాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, బీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, నాయకులు చెన్న య్య, లక్ష్మయ్య, కృష్ణయ్యగౌడ్, రాఘవేందర్ పాల్గొన్నారు.