హన్వాడ, డిసెంబర్ 8 : రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయిలో మాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని కిష్టంపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రూ.2లక్షల వరకు రు ణమాఫీ చేశారా..? రెండు పంటల రైతు భరోసా డబ్బులు వేశారా..? వడ్లు అమ్మిన రైతులకు రూ.500 బోనస్ ఇచ్చారా? అని ఆరా తీయగా వారు ఇంతవరకు ఏదీ ఇవ్వలేదని రైతులు తెలిపారు.
అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ మంత్రిగా ఉన్నప్పుడు గొండ్యాల, వేపూర్, మునిమోక్షం, రామన్నపల్లి వాగుపై నాలుగు చెక్‌డ్యాంలు మంజూరు చేస్తే నేటికీ పనులు ప్రారంభించలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి మండలంలోని చెరువులు నింపి మూడు పంటలు పం డేవన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ సాధ్యం కాని హా మీలిచ్చి నేటికీ ఒక్క హామీ అమలు చేయడం లేదని ఆరోపించారు.
రుణాలను వెంటనే మాఫీ చేయాలని, రైతు భ రోసా డబ్బులు ఖాతాల్లో జమచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం దళితబంధు కింద లబ్ధిదారులకు మంజూరైన జేసీబీ, ట్రాక్టర్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజు, నాయకులు లక్ష్మయ్య, చె న్నయ్య, నరేందర్, శ్రీనివాసులు, అనంతరెడ్డి, జంబుల య్య, భీమయ్య, తేజ, ఖాజాగౌడ్, మాధవులు ఉన్నారు.