పాలమూరు, మే 9 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానని రుణమాఫీ ఎక్కడ పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. గురువారం మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్, వెంకటాపూర్, రాంచంద్రాపూర్, కోడూరు, జమిస్తాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి శ్రీనివాస్‌గౌడ్ బీఆర్ఎస్ ఎంపీ అ భ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏ ఊళ్లోకి వెళ్లినా మాజీ మంత్రికి జనం నీరాజనం పలికారు. వారితో ఆయన అప్యాయంగా మాట్లాడి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారు ఎదుర్కొంటున్న బాధలను వెల్లడించారు. పదేండ్లలో కేసీఆర్ ప్ర భుత్వం చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు. మళ్లా కేసీఆర్ సారే వస్తాడని, బీఆర్ఎస్కే ఓటేస్తామని పలువురు ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌ డ్ మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఐదు నెలలవుతున్నా రుణమాఫీ మాటే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు.
రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే పంటపెట్టుబడి సా యం డబ్బులు అందక ఎందరో కర్షకులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల బాగోగులను పట్టించుకోవడం లేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్ష సాయంతోపాటు తులం బంగారం ఏమైందని నిలదీశారు. వృద్ధులు, వితంతులకు రూ.4 వేల పింఛన్ ఇస్తానని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలో అం దించిన సాయాన్నే ఇస్తున్నారన్నారు.
బీఆర్ఎస్ హ యాంలో కరెంట్ కోతలు ఉండేవి కావని, కానీ నేడు ప వర్ కట్‌తో జనం ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. ఓ వైపు వ్యవసాయానికి కరెంట్ సరఫరా లేక.. మరోవైపు బోర్లు, కాల్వలు వట్టిబోవడంతో సాగునీటికి రైతులు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెలు, పలు పట్టణాల్లో దాహందాహం మొదలైందన్నారు. దూ రంగా ఉన్న వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకునే దుస్థితి ఏర్పడిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం మి షన్ భగీరథ పథకంలో భాగంగా నల్లాల ద్వారా ఇంటి వద్దకే శుద్ధమైన నీటిని అందించినట్లు గుర్తు చేశారు. ఇక బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడుతూ.. ఆలయాల పేరుతో ఓట్లను దండుకోవాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ సర్కారుతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మొద్దని సూచించారు. గ్రా మాల్‌లోకి ప్రచారానికి వచ్చే ఈ రెండు పార్టీల నాయకులను ఏం చేశారో చెప్పాలని నిలదీయాలని సూచించా రు. పేదల సంక్షేమ, అభివృద్ధి గురించి నిత్యం పరితపించిన బీఆర్ఎస్కు అండగా నిలబడాలన్నారు. సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరోసారి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. ఈ ప్రాంతంలోని అభివృద్ధి, స మస్యలపై గళం విప్పే నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ మా జీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ఎంపీపీ సుధాశ్రీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, జెడ్పీ, మండల కో ఆప్షన్ సభ్యులు అల్లాఉద్దీన్, మస్తాన్, నాయకులు రవీందర్‌రెడ్డి, ఆంజనేయులు, రాఘవేందర్‌గౌడ్, మల్లు న ర్సింహారెడ్డి, దేవేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, రాంచంద్ర య్య, రాణెమ్మ, రమ్య, శ్రీను, శ్రీనివాసులు, చిన్నయ్యగౌడ్, మొగులప్ప, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.