మహబూబ్‌నగర్ అర్బన్/హన్వాడ, అక్టోబర్ 9 : బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో హన్వాడ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా మాజీ మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో కాం గ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నా రు.
ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ము ఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన బాకీ కార్డులను ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించాలని కోరా రు. అనంతరం మండలంలోని హన్వా డ(2), షేక్‌పల్లి, గొండ్యాల, సల్లోనిపల్లి, బుద్ధారం గ్రామాలకు సంబంధించి ఎం పీటీసీ అభ్యర్ధులను మాజీ మంత్రి ప్రకటించారు.
ఆయా గ్రామాల కార్యకర్తలు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ఒకరి పేరును ప్రతిపాదించడంపై ఆయ న వారిని అభినందించారు. త్వర లో అన్ని గ్రామాల ఎంపీటీసీల అభ్యర్ధులను కూడా ప్రకటిస్తామన్నారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ ఎంపీపీ బాలరాజు, సింగిల్ విండో చైర్మన్, వైస్ చైర్మ న్ వెంకటయ్య, క్పష్ణయ్యగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ జెడ్పీటీసీ నరేందర్, నాయకులు చెన్నయ్య, నాగ న్న, జంబులయ్య, శ్రీనివాసులు, రాఘవులు, బసిరెడ్డి, శివకుమార్, రాజుయాదవ్, అనంతరెడ్డి తదితరులు ఉన్నారు.