మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 26 : తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తి ప్పి.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చే పట్టిన దీక్షకు దిగివచ్చిన కేం ద్రం తె లంగాణపై ప్రకటన చేసిందని.. దా న్ని గుర్తు చేస్తూ ఈనెల 29న చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ విజయవంతానికి సన్నాహక సమావేశం ని ర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి క్యామ మల్లేశ్ హాజరయ్యారు.
నవంబర్ 29, 2009న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను మరొక్కసారి యాది చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల 29న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో దీక్షాదివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిద్దామన్నారు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గు ర్తు చేసుకుంటూ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు గుర్తు చేయాల్సిన అవస రం ఉందన్నారు. దీక్షా దివస్‌లో భా గంగా నిర్వహించాల్సిన విధివిధానాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు. కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చేలా చూడాలన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, గణేశ్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పోరాటం, ఆ యన దీక్ష చెరగని ము ద్ర వేసిందని ఆ దీక్ష ను మరోసారి మన నం చేసుకుందామని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నా రు. అధికారం కోల్పోయిన గ్రామాల్లో ఉం డే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తూ ఎంతో బాధను అనుభవిస్తున్నారని.. వారందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్న మెసేజ్ పెట్టినా.. వాట్సాప్ లో అభిప్రాయం చెప్పినా భరించలేని కాంగ్రెస్ నా యకులు వారిపై కేసులు పెట్టి సామాన్యులను జైలుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారిని కాపాడుకుంటామన్నారు.
తెలంగాణ మలిదశ పోరాటానికి కేసీఆర్ చేపట్టి న దీక్ష కారణమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు పూ నుకున్నారని.. నవంబర్ 29న దీక్ష ప్రారంభిస్తే.. డిసెంబర్ 9న కేంద్రం దిగివచ్చి ప్రకటన చేసిందన్నారు. కేసీఆర్ దీక్షకు కేంద్రం వణికిపోయి.. ప్రొఫెసర్ జయశంకర్‌కు రాయభారం పంపిందని.. తె లంగాణ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఎలాంటి ప్రకటన చేస్తే కేసీఆర్ దీక్ష విరమిస్తారో ఆ ప్రకటన చేస్తామని చెప్పారన్నారు. దివంగత జయశంకర్ అప్పటికప్పుడే నోట్ తయారు చేసి కేంద్రానికి పంపారని అదే నోట్‌ను చిదంబరం ఢిల్లీలో చదివి వినిపించారన్నారు. ఆ తర్వాత కేసీఆర్ దీక్ష విరమింప చేశారని తెలంగాణ సాధనకు ఈ దీక్ష చ రిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకే దీక్షాదివస్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఎన్నో త్యాగాల పునాదులపై బీఆర్ఎస్ జెండా ఎగిరిందని, కేసీఆర్ చేసిన త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఈనెల 29న మహబూబ్‌నగర్‌లో చేపట్టే దీక్షా దివస్ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పుట్టినప్పటినుంచి ఎంతో మంది వచ్చారు ఎంతోమంది వెళ్లారు. కార్యకర్తలు జెండాలు మోస్తూ నే ఉన్నారు. అందరికీ అవకాశాలు రావు వచ్చిన వాళ్లు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పార్టీ క్రమశిక్షణలో తప్పితే ఎంతటి వారినైనా స స్పెండ్ చేస్తాం అంటూ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వానికి ఎప్పుడు బాసటగా ఉంటారని ఆ పరిస్థితి మళ్లీ రాబోతుందన్నారు.