వనపర్తి టౌన్, సెప్టెంబర్ 3 : యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే అసలు యూరియా కొరతే లేదని సీఎం రేవంత్‌రెడ్డి, యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చిన వారు రైతులు కాదని వ్యవసాయ శాఖ మంత్రి, యూరియా సమస్యలను పెద్దగా చిత్రీకరిస్తున్నారని ఇంకో మం త్రి అనడం వారి చిత్తశుద్ధి, నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు పర్యటనలో చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బుధవారం ప్రకటనలో స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కోసం రైతులు రోడ్లపైకి వస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. యూరియా కొరత లేదని అంటే మరి రైతులు రోడ్లేందుకు ఎక్కుతున్నారని అన్నారు. యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం చూసి చూ డనట్లు వ్యవహరిస్తుందని, ఇది ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు, రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి, నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రెండేళ్లుగా పెండింగ్‌లో పెట్టారని, వ్యక్తిగత ప్రతిష్ట కోసం కొడంగల్ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో కేసులు వేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించడం హాస్యాస్ప దంగా ఉందన్నారు. వందల కేసులతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. నాటి పాలమూరు వలసలు, కరువు, కన్నీళ్లకు కారణమే దశాబ్దాల కాంగ్రెస్, టీడీపీ పాలన అని అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి పాలమూరు ప్రాతి పదిక అయిందని, పాలమూరు వెతలను శ్రీకృష్ణ కమిటీ ముందు ఉంచడం జరిగిందని, ఈ వెతలకు కారణం గత పాలకులు అ న్న విషయం ప్రపంచానికి తెలుసని అన్నారు. రెండేళ్లలో పా లమూరుకు ఏం చేశాడో రేవంత్‌రెడ్డి చెప్పాలని, ఏ అభివృద్ధ్ది చేశాడని మరోసారి అవకాశం ఇవ్వాలన్నారు. కేసీఆర్ హ యాంలో మంజూరైన మెడికల్ కళాశాలను కొడంగల్‌కు తర లించి.. కళాశాలల మంజూరు గురించి మాట్లాడడం విడ్డూ రంగా ఉందన్నారు.
ఉమ్మడి జిల్లాలో మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు, ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేసింది.. బీఆర్ఎస్ హయాంలోనే అన్నది మర్చిపోవద్దన్నారు. 52సార్లు ఢిల్లీ పర్యటనకు రేవంత్ వెళ్లి ఒక్క రూపాయి కానీ, కొత్త కళాశాలల మంజూరు గానీ తీ సు కురాలేదని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూ ర్తి చేయాలన్నారు.