వనపర్తి, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సాధన ఉద్యమంలో నాడు కేసీఆర్ చేపట్టిన దీక్షాదివస్తోనే తెలంగాణ ఏర్పాటుకు దశ దిశ నిర్ణయమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ స్ఫూర్తితోనే రాష్ర్టాన్ని సాధించుకు న్నామన్నారు. పదేండ్లలో రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపామన్నారు. శుక్రవారం దీక్షాదివస్‌ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించా రు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వా తంత్య్రం కోసం 200 ఏండ్లు ఉద్యమం జరిగింద ని, ఇందులో 27 ఏండ్లు మహాత్మాగాంధీ పోరాటం చేశారని గుర్తు చేశారు.
అదే కోణంలో అరవైఏండ్ల తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ 14 ఏండ్ల పోరాటంతో రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందని చెప్పా రు. దశాబ్దాల తరబడి ఉద్యమం చేసి సాధించుకు న్న రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేకులకు స్థానం లే కుండా చేయాలన్నారు. దేశంలో నాడు పంటల సా గులో అగ్రగామిగా ఉన్న పంజాబ్, హర్యాన లాం టి రాష్ర్టాలకు మించి తెలంగాణలో కేసీఆర్ ముందు చూపుతో మొదటిస్థానంలో నిలిపారన్నారు. ఏనా డూ ప్రజలకు కేసీఆర్ ఒట్టిమాటలు చెప్పలేదని, అ మలు కాని హామీలు ఇవ్వలేదని ప్రజలందరి మేలు కోసం పరితపించి పనిచేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన 11 నెలల్లోనే ప్రజావ్యతిరేకత మూ టగట్టుకున్నదని, ఇంతలా దిగజారిన పార్టీని దేశం లో ఎక్కడా చూడలేదన్నారు. ఎటు చూసినా.. ఏ వర్గం వారిని కదిలించినా ప్రజాగ్రహం పెల్లుబికుతున్నదన్నారు. నిత్యం అప్పులు చేశారని చెబుతు న్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులకు తెలంగాణ రా ష్ట్రం ఏర్పడే నాటికే రూ.88వేల కోట్ల అప్పు ఉన్న సంగతిని గుర్తు చేసుకోవాలన్నారు. నిత్యం అబద్ధాలతో పాలన సాగిస్తున్నారని, గాలి మాటలతో గారడీ చేస్తూ తప్పుదోవపట్టిస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక ఎన్ని చెప్పినా నమ్మే స్థితిలో లేరన్నారు. గుత్తేదారులైన మంత్రులు బిల్లులు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఆరు శాఖలకు మంత్రులు లేరని, పాలన అధ్వానంగా తయారైందన్నారు.
గాడితప్పుతున్న కాంగ్రెస్ పాలన నుంచి ప్రజల మనస్సును తప్పించేందుకు ప్రతి రోజూ కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తామంటూ అడ్డగోలు ప్రకటనలు చేస్తున్నదని విమర్శించారు. బట్టకాల్చి మీదవేసి బద్నాం చేస్తూ ఏదో సాకుతో అరెస్టుల పర్వాన్ని ముందుకు తెస్తున్నదన్నారు. అయితే, కేసీఆర్‌లాంటి వ్యక్తిని ముట్టుకుంటే ఒక్కొక్క గ్రామంలో వందలాది కేసీఆర్‌లు పుట్టుకొస్తారని హెచ్చరించారు.
రాష్ట్ర సాధనకు ముందు ఇలాంటి అనేక బెదిరింపులు చూశారని, ఈ బుడ్డ బెదిరింపులకు బీఆర్ఎస్లోని ఓ చి న్న కార్యకర్త కూడా భయపడరన్నారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం దీక్షాదివస్, తెలంగాణ ఉద్యమంపై లఘు చిత్రాలను ఎ ల్ఈడీ ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో నా యకులు బీ.లక్ష్మయ్య, వామన్‌గౌడ్, డాక్టర్ ప్రత్యూ ష, గుంత మౌనిక, సుకేశిని, రమేశ్‌గౌడ్, వాకిటి శ్రీధర్, కురుమూర్తియాదవ్, లక్ష్మారెడి,్డ కృష్ణానాయక్, అశోక్, జాత్రునాయక్, గులాం ఖాదర్, జహంగీర్, సర్దార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
పథకాలను రద్దు చేసినందుకేనా కాంగ్రెస్ ప్రభు త్వం రైతు సంబురాలు నిర్వహిస్తున్నదని మాజీ మం త్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతుబంధును పూర్తి గా ఎత్తివేసిందని.., రూ.15వేలు రైతుభరోసా ఇస్తామంటూ మోసం చేసిందన్నారు. ఇదొక్కటే కాదు.. ఎ న్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపో గా, గతంలో అమలైన వాటిని సైతం నిలిపివేయడం తో జనం ఆక్రోశాలను వెల్లగక్కుతున్నారన్నారు. రైతుబంధు లేక బాధల్లో ఉంటే సంబురాలు నిర్వహించుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు కేబినెట్ హోదాలో ఉ న్నా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పెండింగ్‌లో పెట్టారన్నారు. కేవలం పదిశాతం మేర మిగిలిన పనులను పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలోని 12 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.
కాంగ్రెస్‌లో పార్టీ తెలంగాణ ఇవ్వదని రాజీనామా చేసి.. బీఆర్ఎస్ నుం చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు పొందిన జూప ల్లి కృష్ణారావు నేడు ఆ కృతజ్ఞతను మరిచి కేసీఆర్ అవినీతి అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఓడిపోయినా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలను అనుభవించిన ఆయన అవినీతి గురించి మాట్లాడడం లో అర్థం లేదన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు అందుబాటులో ఉం డాలని, వారి యోగక్షేమాల్లో పాలుపంచుకుంటూ విశ్వాసాన్ని చూరగొనాలన్నారు. ప్రజలను మరిచిపో తే మనుగడ ఉండదని, గ్రామాల్లో కలిసి వచ్చే వారిని సమన్వయం చేసుకుంటూ గౌరవంతో మెలగాలన్నా రు. ద్రోహం చేస్తూ మన పక్కల ఉండే వారిని గుర్తించి మసలుకోవాలని హితవు పలికారు.