వనపర్తి టౌన్, నవంబర్ 15 : ప్రజల మనిషిగా డాక్టర్ బాలకిష్టయ్య చిరస్థాయిగా నిలిచారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జి ల్లా దవాఖానలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలకిష్ట య్య వైద్య వృత్తిలో ఎంతోమంది పేదల ప్రా ణాలు కాపాడి ప్రజా డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారన్నారు.
25 ఏండ్లు సర్పంచుగా, చైర్మన్ గా పనిచేసి వనపర్తికి శాశ్వత తాగునీటి పథకం ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఎంతో అభివృద్ధి సాధించారన్నారు. ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, హైస్కూల్‌తోపాటు జూ నియర్ కళాశాలను ఏర్పాటు చేశారన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో డాక్టర్ బాలకిష్టయ్య కృషి మరువలేనిదన్నా రు. బాలకిష్టయ్య ప్రధాన అనుచరుడు బల రాం వారి జీవిత విశేషాలతో పుస్తకం ఆవిష్కరణ చేశారని, మరోసారి రెండో సంకలనం వ చ్చేలా కృషి చేస్తే తన సహకారం ఉంటుందని తెలిపారు.
డాక్టర్ భూపేశ్ మాట్లాడుతూ ఏ టా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందుకు సహకరిస్తున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లో లక్ష్మయ్య, గట్టుయాదవ్, రమేశ్‌గౌడ్, వా కిటి శ్రీధర్, అశోక్, బాలపీరు, పరంజ్యోతి, కౌన్సిలర్లు నాగన్నయాదవ్, రవి, గులాం ఖా దర్, ఖాన్, ఇమ్రాన్, మతీన్, జోహెబ్ హు స్సేన్, సూర్యవంశపు గిరి, మాణిక్యం, మహేశ్వర్‌రెడ్డి, రాము, రమేశ్, ఆరీఫ్, ఏకే పాషా, మధుసార్, సుబ్బు, రవి, ఖాదర్, మన్నెం, ఖాదర్‌షా, రమేశ్, బలరాం, స్వరాజ్యం, శంకర్‌గౌడ్, నాగరాజు, బాలస్వామి, అమర్నాథ్, నందిమల్ల అశోక్ తదితరులు ఉన్నారు.