నారాయణపేట, డిసెంబర్ 16 : లగచర్ల బాధితులపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకొని వా రిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి చర్లపల్లి జైలులో ఉన్న లగచర్ల, రోటిబండతండా, హకీంపేట, పులిచర్ల, దు ద్యాల, పోలేపల్లి గ్రామాలకు చెందిన రైతులు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కలిసి పరామర్శిం చి ధైర్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని రైతులకు మనోధైర్యాన్ని కల్పించారు.
అనంతరం విలేకరులతో మాజీ మంత్రి మాట్లాడుతూ రైతులను అరెస్టు చేసి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు చా ర్జ్షీట్ వేయకుండా కాలయాపన చేయడం చూస్తుంటే కా వాలనే బెయిల్ రాకుండా పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. రైతులు, బీఆర్ఎస్ నాయకుల పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి ఫార్మా సెజ్ ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గిందన్నారు. రద్దు చేసిన ఫార్మా స్థానంలో ఇండస్ట్రీస్ పేరుతో మరో మా రు రైతులను అన్యాయానికి గురి చేయాలని చూస్తే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ఆ ఆరు గ్రామాల రైతులకు అండగా నిలుస్తామని ప్రకటించారు.