వనపర్తి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తుగ్లక్ పాలనలో సాగుతున్నదని, కాం గ్రెస్ ఏడాది పాలనలోనే ప్రజలంతా ఉద్యమ నా యకుడు, రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ వైపు ఆశతో చూస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నవంబర్ 29న జరిగే దీక్షా దివస్ సన్నాహక సమావేశం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించా రు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యాదా ద్రి భువనగిరి మాజీ జెడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి హా జరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మా ట్లాడుతూ నాటి దీక్షా దివస్ స్ఫూ ర్తితో పార్టీ శ్రే ణులు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరే క విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ పిలు పు మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా ది వస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కా కుండా పదేండ్ల పాలనలో కేసీఆర్ నవనిర్మాణం చేశారన్నా రు.
దేశంలోని ఇతర రాష్ర్టాల్లో జరిగిన అభివృద్ధి, ప దేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ని చూస్తే..అందరికీ అర్థమవుతుందన్నారు. కాం గ్రెస్ మోసపూరిత వాగ్ధానాలను నమ్మి ప్రజలు నట్టేట మునిగారని, దీక్షా దివస్ స్ఫూర్తితో ప్రజల పక్షాన నిలబడి పోరాడాలన్నారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రతో ప్రజలకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులను బలోపేతం చే స్తే..నేడు కాంగ్రెస్ హయాంలో రైతులు నలిగి పో తున్నారన్నారు. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్కే రాష్ట్ర ప్రజల ఆదరణ ఉంటుందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.