మహబూబ్‌నగర్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): / ముసాపేట : ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధుల ను అవమానించినోళ్లు.. పక్షపాతంతో వ్యవహరించే వ్యక్తులు ఎప్పటికీ ప్రజా నాయకులు కాలేరని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. సోమవారం మూడో విడుత ప్రచారంలో భాగంగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి అడ్డాకల్ మండలం బలీదుపల్లి, కమ్మనూర్, చిన్న మునుగల్చెడ్, పెద్ద మునగల్చేడ్, పొన్నకల్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నకల్ గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఎన్నికల్లో ఏం చేశామో చెప్పకుండా.. బ్లాక్ మెయిలింగ్‌కు బెదిరింపులకు గురి చేయ డం.. ఎన్నికైన ప్రజాప్రతినిధులను చులకన చేసి మాట్లాడడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారం చేజిక్కించుకోవడానికి భూమి, ఆకాశం తెచ్చి మీ ముందు పెడతాం అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నానాగోస పెడుతున్నారని విమర్శించారు. రెండేం డ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ అభివృద్ధి కుంటుపడిందని రైతులకు సాగు, తాగు నీరు, కరెంట్, ధాన్యానికి బోనస్ లేక రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కిందన్నారు. పల్లెల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం రూ. 10లక్షలతో ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ ఏర్పాటు చేసి పారిశుధ్య కార్మికులను ని యమించి మొక్క లు నాటి, వైకుంఠ ధామాలు నిర్మించి గ్రామాల అభివృద్ధికి సహకరించారని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో డీజి ల్ పోయించే దిక్కు లేక గ్రామాలు దుర్గంధంగా తయారయ్యాయని ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలైన రైతుబంధు, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్, కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు లాంటి పథకాలు దేశంలోనే చరిత్ర సృష్టించాయని గుర్తు చేశారు.
కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అమలు చేసిన పథకాలను కోతలు పెడుతూ ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని, దీనిపై ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. వీటితోపాటు వారు మహిళలకు ఇస్తామన్న రూ. 2500, వృద్ధులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్, రైతు భరోసా, ఆటో కార్మికులకు ఇస్తామన్న రూ. 12000, కల్యాణలక్ష్మికి అదనంగా ఇస్తామన్న తులం బంగార, ధాన్యానికి బోనస్ ఏమయ్యా యో అడగాలని పిలుపునిచ్చారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమని, అందుకే గ్రామ సర్పంచులుగా బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు.
మీ ఊరికి తొండలు పట్టేటోళ్లు వచ్చిండ్రా..
ప్రజలకు రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశామో చెప్పకుండా వాళ్ల ప్యాంట్లో తొండలిడుస్తాం.. వీళ్ళ ప్యాంట్లలలో తొండలిడుస్తామంటూ దేవరకద్ర ఎమ్మెల్యే అంటున్నారని.. మీ ఉరికి తొండలు పట్టేటోళ్లు వచ్చిండ్రా అంటూ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గ్రామస్తులను అడిగారు. రెండేళ్లలో ఏం అభివృద్ధి చేశావు చెప్పు అని అంటే వాళ్ల ప్యాంట్లు తొండలు వదులుతా.. వీళ్ల ప్యాంట్లలతలో వదులుతా అంటూ కొండలు, గుట్టలు తిరుగుతూ తొండలు పడుతున్నాడని ఎమ్మె ల్యే జీఎంఆర్‌ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ సుపరిపాలన మళ్లీ రావాలంటే బీఆర్ఎస్ పార్టీనీ గెలిపించాలని పిలుపునిచ్చారు. స్కీములు లేని స్కాం కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని పిలు పునిచ్చారు.
పొన్నకల్ కాల్వ కోసం నిరంజన్‌రెడ్డి సహకారంతో రూ.100కోట్లతో ఘనపూర్ నుంచి కాల్వ తెచ్చి నీళ్లు ఇచ్చామని ఇప్పుడు జీవనదిగా ఉండి రైతులు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ఊరు, ఊరులో చెక్ డ్యాం లు కట్టి 12చెరువులు నింపామని, ఇవి కళ్ల ముందు కనబడుతున్నాయని చె ప్పారు. సంక్షేమ పథకాల ద్వారా బ కాయి పడ్డ రూపాయలను ఇచ్చిన తర్వాతే ఓట్లు అడగాలని ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలకు సూచించా రు. ఎమ్మెల్యేకానీ ఆ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదని, ఖబర్దార్ అని హెచ్చరించారు. కార్యక్రమంలో మా జీ జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షు డు గట్టు యా దవ్,నాయకులు, పాల్గొన్నారు.