కొల్లాపూర్, నవంబర్ 16 : కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీరు పా రించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పీ ఆర్ఎల్ఐ మూడో ప్యాకేజీలోని కుడికిళ్ల- తీర్నాంపల్లి మధ్య పెండింగ్‌లో ప్రధాన కాల్వ పనులు చేపట్టాలన్నారు. శనివారం కొల్లాపూర్ మండలంలోని సన్నపుతండా నుంచి కుడికిళ్ల, తీర్నాంపల్లి శివారుల వరకున్న పీఆర్ఎల్ఐ ప్రధాన కాల్వ పనుల ను నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి పలిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రాజెక్టులపై, కృష్ణానది నీటి వినియోగంపై పలు సూచనలు చేశారు.
30మీటర్ల లోతులో మూ డు కిలోమీటర్ల తీర్నాంపల్లి టన్న ల్ ప నుల వరకు పనులు పూర్తి చేస్తే 6.50 టీ ఎంసీలతో ఎదుల రిజర్వాయర్, వ ట్టెం రిజర్వాయర్‌లో 9 టీఎంసీలు, కరివె న రిజర్వాయర్‌లో 19 టీఎంసీలతో ఉదండాపూర్ వరకు నీళ్లను తీసుకెళ్లవచ్చన్నారు. ఈ మూడున్నర కిలోమీటర్లు ఏ డాదిలో గా పూర్తి చేసి ఉంటే బాగుండేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంప్‌హౌస్ వ ద్ద దిగి వెళ్లాడు. మోటర్లు ఆన్‌చేస్తే నీళ్లు చె రువుల్లోకి వెళ్లవు కదా.. ప్రధాన కాల్వ పెండింగ్ పనులను పరిశీలించి వెళ్లి ఉం టే సరిపోయేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీఆర్ఎల్ఐ ప్రధాన కాల్వ వెంట నడిచి పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కృష్ణానది నీళ్లు సముద్రంలో కలవడంతోపాటు పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీవాళ్లు తరలించుకపోయారన్నారు. ము ఖ్యమంత్రి మన జిల్లా వాడేనని పెండిం గ్ పనులు పూర్తి చేసి జన్మధన్యం చేసుకోవాలన్నారు. ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై ఘాటైన విమర్శలు సందించారు.