నారాయణపేట, రూరల్ మార్చి 7: నారాయణపేట జిల్లాలోని పలు మండలాలకు చెందిన ఆధ్యాత్మిక జానపద గురువులను తిరుపతి అన్నమయ్య కళా కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీనగర్ జై భారత్ కళాకేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆధ్యాత్మిక గురువుల సన్మానం జరిగింది. నారాయణపేట, ఉట్కూరు, దామరగిద్ద, మద్దూర్ మండలాలకు చెందిన ఆధ్యాత్మిక జానపద గురువులను తిరుపతి అన్నమయ్య కళాకేంద్రం స్వామి విజయశంకర్ శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ జానపద రూపంలో భక్తిని పరీక్షించడానికి ధర్మాన్ని పెంపొందించేందుకు నిత్యం కృషి చేయాలని సూచించారు.