కొల్లాపూర్ రూరల్, జూలై 2 : అమరగిరి వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. దీంతో నదీ పరివాహక ప్రాంతా ల ప్రజలను అధికారులు అప్రమ త్తం చేశారు.
అమరిగిరి వద్ద కృష్ణానది పుష్కరఘాటు మునిగిపోవడంతో మత్స్యకారులు, ప్రజలెవ్వరూ నదిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అమరగిరి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, ఈ దిశగా మంత్రి జూపల్లి కృష్ణారావు చర్యలు తీసుకోవాలని కొల్లాపూర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.