అయిజ, ఆగస్టు 22 : అయిజ మున్సిపాలిటీతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లా యి. పోలోని వాగుకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. అయిజ మున్సిపాలిటీలోని లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది. అయిజ నుంచి పులికల్, ఉత్తనూర్ తదితర గ్రామాలకు వెళ్లే రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మ డ్డిగుంత కాలనీ, గాజులపేట, భరత్‌నగర్, దుర్గానగర్ తదితర కాలనీలు జలమయమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
ధరూర్, ఆగస్టు 22 : ధరూర్ మండలంలోని నీలహళ్లిలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో వరద ఉ ధృతికి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. గ్రామంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గద్వాల-రాయిచూర్ వెళ్లాల్సిన ప్రయాణికులు రెండు కిలోమీటర్ల దూరంలోని పాతపాలెం వెళ్లి తమ గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. విద్యార్థులు కూ డా ఇలాగే వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిడ్జి నిర్మాణాన్ని అధికారులు త్వరగా పూర్తిచేసి అం దుబాటులోకి తేవాలని గ్రామస్తులు కోరారు.