అయిజ, జూన్ 1 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర ప్రాజెక్టుకు వరద నిలకడగా కొనసాగుతున్నది. ఎగువ ప్రాంతాల నుంచి టీబీలోకి వరద చేరుతుండటంతో డ్యాంలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం ఇన్‌ఫ్లో 22,050 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 263 క్యూసెక్కులు నమోదైంది.
గరిష్ఠ నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1596.35 అడుగులు ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 17.166 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద చేరుతోంది. ఇన్‌ఫ్లో 3,291 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,291 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు చేరుతోంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.5 అడుగుల మేర నీటిమట్టం ఉన్నది.