‘చేపా.. చేపా ఎందుకు పెరగలేదంటే.. నాకు తెలియదు చేపలు పట్టే మత్స్యకారులను అడుగు.. చేపా.. చేపా.. ఎందుకు సన్నగా ఉన్నావంటే నాకు తెలియదు.. నాకు తిండి పెట్టని గుత్తేదారుడిని అ డుగు.. చేపా.. చేపా ఎందుకు తక్కు వ పరిమాణంలో ఉన్నావంటే.. నాకు తెలియదు.. నాపై కమీషన్ వేసుకొ ని భాగాలు పంచుకున్న వారిని అ డుగు’.. అందంట చేప. రెండు ఇంచుల చేప పిల్లల పై భాగాలు తెలియాలంటే ముందు నాగర్‌కర్నూల్ జిల్లాలో మత్స్య శా ఖలో జరుగుతున్న గందరగో ళం గురించి తెలియాలి.
– మహబూబ్‌నగర్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో చేప పిల్లల సీడ్ నాణ్యత, సైజ్ పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామ సమీపంలోని కృష్ణానదిలో చేప పిల్లల పరిమాణం చిన్నగా ఉన్నదని మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేసిన విషయం విధితమే.. నదిలో వదలొద్దని వెనక్కి పంపించారు. అయితే సింగోటం రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి అధికారులు లేకుండా కొంతమంది మాత్రమే మిక్స్ చేసిన సైజ్ తక్కువ ఉన్న చేపపిల్లలతోపాటు మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేసిన మెరుగాల చేప పిల్లలను సింగోటం రిజర్వాయర్‌లోకి వదిలారు. ఓ వైపు మంత్రి చేపపిల్లలను రిజెక్టు చేస్తే.. మరో వైపు రిజర్వాయర్‌లో వదలడంపై మత్స్యకారులు, చేపల సీడ్ గుత్తేదారులు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థిక సమృద్ధి సా ధించాలని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నదుల్లో ఉచితంగా ప్రతి సంవత్సరం చేప పిల్లలను విడుదల చేసేది. దీంతో మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వంలో మత్స్యకారులు కోరుకునే విధంగానే నాణ్యమైన చేపల సీడ్స్‌ను జూన్ నుంచి ఆగస్టులోపు పంపిణీ చేసేది. కానీ ప్రభుత్వం మారడంతోనే మ త్స్యకారుల జీవితాల్లో చీకటి కమ్ముకున్నది. పేరుకు మా త్రం చేపల సీడ్‌ను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా సరైన సమయంలో అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 7వ తేదీ నుంచి నాణ్యతలేని, తక్కువ సైజ్ చేపపిల్లల ను పంపిణీ చేస్తున్నారని, దీంతో చేపల వృద్ధి ఉం డదని, చలికాలంలో ఎదుగుదల మందగిస్తదని మత్స్యకారులు చెబుతున్నారు.
జిల్లా మత్స్య శాఖాధికారిణిపై మత్స్యకారులు అవినీతి, ఆరోపణలు చేస్తున్నారు. గత నెల అక్టోబర్ 29న జిల్లా మత్స్యశాఖాధికారిణి అరాచకా లు, కాంట్రాక్టర్లతో కుమ్మకై మోసం చేయడం, కు లం పేరుతో బెదిరిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మళ్లీ బుధవారం ఆమెను సస్పెండ్ చేయాలని మంత్రి జూపల్లికి ఫిర్యాదు చేశారు. మత్స్యకారుల జీవనోపాధి కోసం ఇస్తున్న చేప పిల్లల పంపిణీపై సమగ్ర విచారణ జరిగిప్పుడు మాత్రమే నిజనిజాలు బయటకు వస్తాయని మత్స్యకార సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
సింగోటం రిజర్వాయర్‌లో చేప పిల్లలను అధికారుల సమక్షంలో వదిలామని, ఇందులో తమ తప్పు ఏమీ లే దని జిల్లా మత్స్యశాఖాధికారిణి రజని పేర్కొన్నారు. రిజర్వాయర్‌లో విడిచిపెట్టిన చేపపిల్లల సంఖ్య గురించి ‘నమస్తే తెలంగాణ ’ వివరణ కోరగా ఇంకా తన వద్దకు స మాచారం రాలేదని తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లా మత్స్యకార శాఖ అధికారులు చేప సీడ్ పంపిణీపై భారీ అవినీతికి పాల్పడుతున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఒక డీసీఎంలో లక్ష చేప పిల్లలు ఉంటాయని దొంగ లెక్కలు కడుతున్నట్లు చెబుతున్నారు. చేపపిల్లల సీడ్ లెక్కించిన చోట సొసైటీలపై అధికారులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 230 దాకా మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. బొచ్చ 35 శాతం, రవట 35, బంగారుతీగ 30 విడివిడిగా ఉండాలి. కానీ అన్ని చేప పిల్లలను మిక్స్ చేసి సైజ్ కొద్దిగా పెద్దగా ఉండే బొచ్చ చేప పిల్లల సీడ్‌ను స్కేల్‌తో కొలుస్తున్నట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మెరగాల కల్తీ బ్రీడ్‌ను పంపిణీ చేస్తున్నట్లు విమర్శిస్తున్నారు. పంపిణీ చేసే సీడ్ సైజ్ కూడా 15 మి.మీ. నుంచి 30 మి.మీటర్ల లోపు ఉన్నట్లు పేర్కొంటున్నారు.