భూత్పూర్, జూన్ 7 : రాష్ట్రస్థాయి అండర్-18 పరుగు పందెంలో మండలంలోని వెల్కిచర్లకు చెం దిన మహేశ్వరి ప్రథమస్థానంలో నిలిచింది. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం నిర్వహించిన 3 కిలోమీటర్ల పోటీలో 10నిమిషాల 55 సెకండ్లు, గురువారం జరిగిన 1,500 మీటర్ల పరుగులో 5నిమిషాల 4సెకండ్లలో పరుగుగెత్తి ప్రథమస్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా మహేశ్వరికి శుక్రవారం ఒలంపిక్ కోచ్ రమే శ్ ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. జాతీ య స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ము న్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీ శేఖర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.