Narayanapeta | మక్తల్, జూలై 15 : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణం కోసం మక్తల్ మండలం కచ్వార్ గ్రామం వద్ద రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పైపులు తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన కంపెనీకి ఇసుక తరలిస్తున్న టిప్పర్ దగ్ధమైంది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళ్తే.. నారాయణపేట – కొండగట్టు పోతాల పథకం నిర్మాణం చేపట్టడం కోసం, మక్తల్ మండలం భూత్పూర్ జలాశయం నుండి పైపులైన్ ద్వారా నీటిని తరలించేందుకు, రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ పైపులు తయారు చేస్తున్న క్రమంలో, ఇసుక సరఫరా చేస్తున్నటువంటి టిప్పర్లో మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది, హుటాహుటిన ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసింది. దీనిపై రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బందిని వివరణ కోరేందుకు చరవాణిలో సంప్రదించగా, సిబ్బంది అందుబాటులోకి రాలేదు.