వనపర్తి, జూలై 29 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లాలో ఎరువుల ధరలకు రెక్కలొ చ్చాయి. ఎమ్మార్పీ ధరలకంటే అధిక రేట్లకు ఎరువుల బస్తాలను అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది ముందే యూరియా కొరత ఉన్నదన్న క్రమంలో కొన్ని చోట్ల అందినకాడికి వ్యాపా రులు కానిచ్చేస్తున్నారు. వానకాలం సీజన్ జోరు మొదలవక ముందే ఈ పరిస్థితి ఉంటే.. రాబోయే రోజులు ఎలా ఉండ బోతాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎకరాకూ ఒక బస్తా యూరియా నిబంధనతో రైతులకు ఎరువుల కష్టాలు మొదలైనట్లుగా వాపోతున్నారు. ఈ సీజన్‌కు అవసరమైనన్ని ఎరువుల అంచనాలకు తగ్గట్టుగా నిల్వలు పూర్తి స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. వనపర్తి జిల్లాలో వాన కాలం సీజన్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది.
50 రోజులకుపైగా కృష్ణానదిలో వరద హోరెత్తినా.. ఇక్కడి సాగునీటి వనరులకు అధికార యంత్రాం గం సమయానికి నీరందించడం లేదని రైతులు ఆ రోపిస్తున్నారు. ఆలస్యంగా ఎత్తిపోతల పథకాలను ప్రారంభం చేయడంతోపాటు స్థానికంగా వర్షాల ప్రభావం తక్కువగా ఉండటంతో వరి నాట్లు ఆలస్యమవుతున్నాయి. జూరాల నిండిన వెంటనే ఇక్కడి కాల్వలు పారించి.. చెరువులు, కుంటలు నింపితే ఈ పాటికే వరి పంట చివరి దశలో ఉం డేది.
దాదాపు 2 లక్షల ఎకరాల్లో సాగు అంచనా ఉండగా.. ప్రస్తుతం 20 వేల ఎకరాల్లో సాగైనట్లు గుర్తించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎరు వుల విషయానికి వస్తే.. ప్రధానంగా యూరియా రైతులకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. అధి కారులు అవసరమైన మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నా.. ఎరు వుల వ్యాపారులు మాత్రం ఎరువుల కొరతను చూయిస్తూ వ్యాపారాన్ని విచ్చలవిడిగా చేసుకుంటున్నారు.
ఎమ్మార్పీ ధరలకు రెక్కలు
వనపర్తి జిల్లాలో ఎరువుల ధరలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. ప్రధానంగా యూరి యాతోపాటు వరికి అవసరమైన ఎరువులపై అధిక ధరల ప్రభావం ఉన్నది. ఎందుకు..? ఏమి టీ? అని రైతులు అడిగితే ఇప్పుడంతే.. ఇంకాస్తా గట్టిగా అడిగితే అసలు ఎరువులే లేవు అంటూ సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒక్క యూరి యానే కాదు అడుగు పిండికి వాడే 20-20-0-13 రకాన్ని సైతం రైతులు అధికంగానే వాడుతున్నారు.
యూరియాతోపాటు ఈ రకం ఎరువులను ప్రాధా న్యతగా ఉపయోగిస్తు న్నా రు. ఒక్కో చోట ఒక్కో మాదిరిగా ఎరువుల ధర లను విక్రయిస్తు న్నారు. సంచికి రూ.వంద అధికంగా తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల జిల్లాలోని పెబ్బేరులో ఓ రైతు అధిక ధరలపై వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ షాపులో విక్రయాలు నిలిపి వేసి నోటీసివ్వడం చూస్తే.. అధిక ధరలకు ఎరువుల విక్రయాలకు ఊతమిస్తున్నది.
తనిఖీలు నామమాత్రమే..
జిల్లాలో ఎరువుల దుకాణాల్లో చేస్తున్న తనిఖీలన్నీ తూతూ మంత్రంగా కొనసాగుతున్నాయి. ఇంత బహిరంగంగా అధిక ధరలకు ఎరువులను విక్ర యిస్తుంటే.. అధికారులు చేస్తున్న తనిఖీలు రైతు లకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. తనిఖీల సమాచారం ముందస్తుగా షాపు యజమానికి ఇచ్చి వెల్లడంతో చుట్టపు చూపులాగానే పరిశీలన ముగుస్తున్నది. నిజమైన తనిఖీలుంటే అధిక ధరలు నియంత్రణలోనే ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మండలంలోని ముగ్గురు అధి కార సభ్యుల బృందంతో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసేలా జిల్లాలో 15 టీంలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు జిల్లా స్థాయిలోనూ ముగ్గురు
అధికారుల బృందం ప్రత్యేక మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. తనిఖీలకు వెళ్లినప్పుడు మాత్రమే స్టాక్ బోర్డులు ధరల పట్టికలు కనిపి స్తాయి. వారు వెళ్లిన అనంతరం తెరమరుగ వుతాయి. ఇదిలా ఉంటే.. పెబ్బేరు కేంద్రంలోని ఓ దుకాణంలో ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఫిర్యాదుపై అక్కడ విక్రయాలు నిలిపి వేసి నోటీసు ఇచ్చారు.
ఫోన్లో స్పందించని జిల్లా అధికారి
జిల్లాలో అధిక ధరలకు ఎరువుల బస్తాలను విక్రయిస్తున్న సమాచారంపై జిల్లా వ్యవసాయ అధికారి స్పందించలేదు. మంగళవారం ఒంటి గంట సమయంలో జిల్లా కార్యాలయంలో అధికా రి లేనందునా.. సాయంత్రం 4 గంటలకు ఫోన్ లో ‘నమస్తే తెలంగాణ’ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఫోన్ రింగ్ అయినప్పటికీ అ ధికారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఏదేమై నా అధిక ధరలకు ఎరువులను కొనుగోలు చేసే రైతులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి.
ఈ ఫొటోలో చూస్తున్న రైతు పేరు రాజన్న. ఊరు పెద్దమందడి మండలం దొడగుంటపల్లి. ప్రస్తుతం రాజన్న మూడు ఎకరాల్లో వరి నాట్లు వేస్తున్నాడు. ఇందుకు మూడు రోజుల కిందట మండలంలోని సోలిపూర్లో 5 బస్తాల 20-20-0-13 రకం అడుగు పిండిని కొనుగోలు చేశాడు. ఈ బస్తాపై ఎంఆర్పీ ధర రూ.1300గా ఉన్నది. అయితే ఫర్టిలైజర్ దుకాణ యజమాని మాత్రం రూ.1400 తీసుకున్నాడు. చివరకు ఓ తెల్ల కాగితంపై లెక్క రాసిచ్చాడు. ఇదేమని అడిగితే.. ఎరువులు లేవు..
నీ ఇష్టం ఉంటే తీసుకో.. లేదంటే వెళ్లు అన్నాడు.. చేసేదేమీ లేక రైతు రాజన్న ఎరువుల బస్తాలను తెచ్చుకున్నాడు’.. ఒక్క రాజన్ననే కాదు. వనపర్తి జిల్లాలోని చాలా మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గంగాధర్‌రెడ్డి. ఇతడిది అమరచింత మండల కేంద్రం. ఆయనకు నాలుగెకరాలు వరి సాగు పొలం ఉన్నది. ఇటీవల అమరచింతలోని ఓ షాపులో నాలుగు యూరియా బస్తాలు కొనుగోలు చేశాడు. బస్తాలపై ఎమ్మార్పీ రూ.266 ఉంటే.. వ్యాపారి మాత్రం రూ.300 తీసుకున్నాడు. అయితే రైతుకు బిల్లు మాత్రం ఇవ్వలేదు. తన పనికి ఆటంకం అవుతుందని రైతు గంగాధర్‌రెడ్డి చడీచప్పుడు లేకుండా ఎరువులను బస్తాలతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆహో.. ఓహో అంటూ ప్రచారం చేస్తున్న అధికారులకు ఇలాంటివి ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.