కల్వకుర్తి రూరల్, జనవరి 24 : పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాం డ్ చేశారు. శుక్రవారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు వివిధ గ్రామాల నుంచి రైతులు పల్లీలను తీసుకురాగా వాటికి మార్కెట్లోని వ్యాపారులు సరైన ధరను టెండర్ చేయకపోవడంతో రైతులు హైదరాబాద్ చౌరస్తాకు చేరుకొని ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇతర మార్కెట్ యార్డుల్లో పల్లీకి మద్దతు ధర రూ. ఏడు వేల వరకు ఉండగా కల్వకుర్తిలో మా త్రం రూ.ఐదు వేలు మాత్రమే ఎలా చెల్లిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులోని వ్యాపారులు, అధికారులు కు మ్మక్కై ధరను తగ్గించారని ఆరోపించారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించి తమకు న్యాయం చేయాలని కోరారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు, వ్యవసాయ మార్కెట్ అధికారులు రైతులకు న్యా యం జరిగేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.