అమరచింత, సెప్టెంబర్ 24 : ఎ న్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఏమైందని మక్తల్ ఎ మ్మెల్యే వాకిటి శ్రీహరిని నిలదీసిన ఘ టన అమరచింత మండలం నాగల్‌కడ్మూర్‌లో చోటు చేసుకున్నది. నాగల్‌కడ్మూర్‌లో గ్రామస్తులు చందాలు వే సుకొని ఏర్పాటు చేసుకున్న 16 సీసీ కెమెరాలను ఆత్మకూర్ సీఐ శివశంకర్, అమరచింత ఎస్సై సురేశ్‌తో కలి సి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంగళవారం ప్రారంభించారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వ ద్ద ఏర్పాటు చేసిన సబ్సిడీ సిలిండర్ల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మా ట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హమీ మేరకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేశామని, రెండు వందల యూనిట్ల వరకు ప్రతి ఇంటికీ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అనడంతో గ్రామానికి చెందిన వ్యక్తి తమకు ఉచిత విద్యుత్ పథకం అమలు కావడం లేదని, ఈ రోజే విద్యుత్ అధికారులు నాతో బిల్లు కట్టించుకున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చాడు.
అదేవిధంగా మీరు చెప్పినట్లుగా రూ.2లక్షల రుణమాఫీ మాకు అమలు కాలేదని తిరుపత న్న, రాజశేఖర్‌గౌడ్, రంగన్న, నడిపి కృష్ణారె డ్డి, బీ తిరుపతిరెడ్డితోపాటు పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. రుణమాఫీ ఎందుకు కాలేదని అడుగుతుండగానే, మరో పక్క మహిళలు లేచి భూమి లేని వాళ్లకు ఇ స్తామన్న కౌలు రైతు డబ్బులను ఇవ్వాలని, ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిలదీశారు.
దీం తో అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ మహిళలను గమ్ముగా కూర్చోవాలని, లేదంటే ఇక్కడి నుం చి వెళ్లాలని అనడంతో ఎమ్మెల్యే కల్పించుకొ ని గ్రామంలో 143మంది రైతులకు రూ. 4.17 కోట్ల రుణమాఫీ అయ్యిందని, కొంతమందికి రాకపోతే ఇంతలా గొడవ చేయడం సరికాదన్నారు. అక్కడే ఉన్న విద్యుత్, వ్యవసాయ అధికారులను వీళ్లకు ఎందుకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ అమలు కాలేదని ఎ మ్మెల్యే శ్రీహరిని ప్రశ్నించడంతో ఒకే రేషన్‌కార్డుపై ఇద్దరు, ముగ్గురు రైతులు ఉండడం తో కాలేదని తెలిపారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారుల పేర్లను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.