అమరచింత, ఆగస్టు 21 : రుణమాఫీలో చాలా మంది రైతుల పేర్లు లేకపోవడంతో బాధితులు బ్యాంకులు, కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో వివరాలను తెలుసుకునేందుకు బుధవారం మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంక్ వద్దకు భారీగా తరలివచ్చారు. బ్యాంక్ సిబ్బంది తమ విధులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని బ్యాంక్ బయట మహిళలు, పురుషులకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేశారు. ఒకరి తర్వాత ఒకరిని బ్యాంక్ లోపలికి అనుమతించారు. బ్యాంక్ సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య విధులు నిర్వర్తించాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఉద్యోగాలిచ్చేందుకు రేషన్‌కార్డు అవసరం లేనప్పుడు.. రుణమాఫీ చేసేందుకు రేషన్‌కా ర్డు నిబంధన ఎందుకు పెట్టారు. అలాంటప్పుడు ముందే చెప్పాల్సింది. రైతులందరూ బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోండి.. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ఎం దుకు చెప్పారు. ఎన్నికల ముందు చెప్పిందొకటి.. ఎన్నికలయ్యాక చేస్తున్నదొకటి.
సాధ్యం కానప్పుడు చెప్పాల్సిన అవసరం లేకుండె. హామీలిచ్చి, ప్రగల్భాలు పలికి ఇప్పుడిలా కొ సిరి కొసిరి చేస్తుంటే అనవసరమైన బద్నామ్. ప్రజలు ఎంతో మార్పుకోరి అవకాశమిస్తే ఇలా నట్టేట్లో ముంచే లా వ్యవహరించడం సరికాదు. మాట ప్రకారం కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలి. రేషన్‌కార్డు నిబంధనను ఎత్తేసి పాసుపుస్తకం ఉన్న అందరికీ రూ.2 లక్షల వరకు మాఫీ ఒకేసారి చేయాలి. అప్పుడే చెప్పిన మా ట, ఇచ్చిన హామీ సార్థకం అవుతుంది. ఈ కొ ర్రీలతో రైతులందరినీ తేడాలు చూసి వడ్డిస్తున్నట్లు కనబడుతుంది. ప్రభుత్వంపై నైరాశ్యం నెలకొన్నది.
ఆఖరికి బీఆర్ఎస్ నేత హరీశ్‌రా వు చెప్పిన మాటలే నిజమయ్యాయని అనుకుంటున్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయలేరన్న మాటలను గుర్తుచేసుకుంటూ సీ ఎం రేవంత్ చేసిన ప్రకటనలను చర్చించుకుం టున్నారు. కేసీఆర్ ఒకేసారి చేయకున్నా కొర్రీ లు లేకుండా అర్హులందరికీ చేశాడని చెప్పుకొంటున్నారు. ఎవ్వరికి చెప్పుకోవాలో అర్థంకాక రైతు లు నీళ్లు నములుతున్నారు. షరతులు ఎత్తివేసి రుణమాఫీ చేయకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
– తిరుపతయ్య, కాంగ్రెస్ మండల నేత, ఆత్మకూరు, వనపర్తి జిల్లా
నాకు రెండు ఎకరాల పొలం ఉంది. సాగు చేయడానికి గతేడాది రూ.లక్షా ఇరవై వేలు లోన్ తీసుకున్నాను. రెండో విడుతలో రుణం మాఫీ అవుతుందని ఆశపడ్డా, కానీ కాలేదు. మూడు వారాల నుంచి బ్యాంక్, వ్యవసాయ కార్యాలయం చూట్టూ తిరుగుతూనే ఉన్నాను. మూడో విడుత జాబితాలోనైనా పేరు వస్తుందేమో నని చూశాను. కానీ, ఇప్పటివరకు నాకు రుణమాఫీ వర్తించలేదు. మోకాళ్ల నొప్పితో బాధపడుతూ కాళ్లరిగేలా నిత్యం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కండీషన్లు పెట్టకుండా అందరికీ రుణమాఫీ వర్తింపజేయాలి. నాలాంటి రైతుల గోసను తీర్చాలి. కేసీఆర్ సర్కారు హయాంలో అందరికీ మాఫీ అయ్యింది.
– ఏ.శాంతమ్మ, దళిత మహిళా రైతు, కొత్త ఎస్సీ కాలనీ, అమరచింత, వనపర్తి జిల్లా
పాస్‌బుక్కులు మా త్రమే చూసి రుణం ఇచ్చిన బ్యాంకోళ్లు.. ఇప్పుడు రుణమాఫీ విషయంలో మాత్రం రేషన్‌కార్డులో ఇద్దరు ఉన్నారు.. ఆధార్‌లో, పాస్‌బుక్‌లో పేరు తప్పుంది అని కుంటిసాకులు చెబుతున్నారు. నేను గతేడాది రూ.2 లక్షల లోన్ తీసుకున్నాను. నా భార్య పేరు మీద రూ.1.40 లక్షలు తీసుకొని రెన్యూవల్ చేసుకున్నాం. కాంగ్రె స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఇద్దరిలో ఒకరికి రుణమాఫీ వర్తిస్తుందని ఎదురుచూశాం. రెండు, మూడో విడుత జాబితాలో ఎవరి పేరూ రాలేదు. ఇప్పుడు వ్యవసా య పనులు జోరుగా సాగుతున్నాయి. పొలంలో కూలీలను పెట్టి మేము పనులు వదిలేసి మాఫీ కోసం తిరుగుతున్నాం.
– మధుగాని నాగరాజు, రైతు, అమరచింత, వనపర్తి జిల్లా
ఎన్నికలకు ముందు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని కాంగ్రెసోళ్లు చెప్పారు. ఇ ప్పుడు రేషన్‌కార్డు అంటూ, పేర్లు మ్యాచ్ కావడం లేదం టూ సీఎం రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేశాడు. నాకు రూ.70 వేలు వ్యవసాయం రుణం ఉంది. ఇప్పటికీ ఒక్క పైసా మాఫీ కాలేదు. అధికారులను అడిగితే పొంతనలేని స మాధానం చెబుతున్నారు. ఇక మాఫీ అయితదన్న నమ్మకం నాకైతే లేదు.
– గోరటి వెంకటయ్య, రైతు, కుప్పగండ్ల గ్రామం, వెల్దండ మండలం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఒకటి అమలు చేయలేదు. పేరుకే రైతు ప్రభుత్వం రైతుకు చేసింది ఏమిలేదు. రుణమాఫీ అన్నారు.. ఇంతవరకు పైసా కుడా మాఫీ కాలేదు.. నేను రూ.70వేలు రుణం తీసుకు న్నాను. వడ్డీతో కలిపి రూ. లక్ష దాటింది. ఎన్ని లిస్టులు చూ సినా నా పేరు రాకపాయె. ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మా లి.. ఒక్క పని సక్కగా లేదు.. కేసీఆర్ ప్రభుత్వమే నయ్యముండేనని గిప్పుడనిపిస్తుంది..
– మెరుగు రంగయ్య, రైతు, కుప్పగండ్ల గ్రామం, వెల్దండ మండలం
నాకు పల్లెపాడు శివారులో మూడెకరాల వ్య వసాయ భూమి ఉన్నది. గతేడాది నవంబర్‌లో లింగనవా యి కెనరా బ్యాంక్‌లో రూ.2 లక్షలు రుణం తీసుకున్నాను. ప్రభుత్వం విడుదల చేసిన మూడో విడుత జాబితాలో పేరు వస్తుందని భావించా. అయినా రాలేదు. అధికారులను అడిగితే ఇదిగో.. అదిగో అంటున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. మూడో విడుత వరకు వేచి ఉన్నప్పటికీ ఫలితం లేకపోయింది.
– సుంకులన్న గౌడ్, పల్లెపాడు గ్రామం, అలంపూర్ మండలం
గతేడాది నవంబర్‌లో లింగనవాయి కెనరా బ్యాంక్‌లో రూ.2 లక్షల రుణం తీసుకున్నాను. ప్రభుత్వం ఇచ్చిన మూడో విడుత జాబితాలో నా పేరు రాలేదు. రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తామని చెబుతూ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతున్నది. రేషన్‌కార్డులు లేవని, ఆధార్ స్థానికంగా లేదని నానా షరతులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న ది. ఎన్నికల ముందు అబద్దాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకుంటలేదు.