కల్వకుర్తి, ఫిబ్రవరి 11 : వ్యాపారులు సిండికేట్ గా మారి వేరుశనగకు తక్కువ ధర ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌కు రైతులు ఆదివారం 12వేల కు పైగా వేరుశనగ బస్తాలను తీసుకొచ్చారు. కాగా వ్యాపారులు రహస్య టెండర్ విధానంలో ధర అత్యధికంగా రూ.7,040, మధ్యస్తంగా రూ.6,100, అ త్యల్పంగా రూ.4,806 నిర్ణయించారు. గరిష్ఠ ధరను ఒకట్రెండు క్వింటాళ్ల వేరుశనగకు నిర్ణయించి, ఎక్కువ బస్తాలకు రూ.4800 నుంచి రూ.5,500 ధర నిర్ణయించడంతో రైతులు భగ్గుమన్నారు. నెల వ్యవధిలో రూ.2వేల ధర తగ్గిందని ఆందోళనకు దిగారు. సింగికేట్గా మారి తమను నిలువునా దోచుకుంటున్నారని ఆవేదన వ్య క్తం చేస్తూ వ్యాపారులతో వాదనకు దిగా రు. మార్కెట్ లేదని వ్యాపారులు సమాధానమివ్వడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ర్యాలీగా వెళ్లి మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న హైదరాబాద్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టడంతో ట్రాఫిక్ ని లిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రాస్తారోకో తో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగతాయని నచ్చజెప్పారు. మార్కెట్ కార్యదర్శి, వ్యాపారులతో చర్చిద్దామని చెప్పి రైతులను మార్కెట్ యా ర్డుకు తీసుకెళ్లారు. కొంతమంది రైతులు, పోలీస్ అధికారులు కలిసి మార్కెట్ కార్యదర్శి, వ్యాపారులతో చర్చించారు. ధర పెంచే విషయంలో వ్యాపారులు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో అనుమానం మొ దలైంది.
వ్యాపారులు సిండికేట్‌గా మారి ఉద్దేశపూర్వకంగానే ధర తగ్గించారని, రోజురోజుకూ ధర త గ్గుతూ పోతే మా బతుకులెట్లా.. ఏదైతే అదైతదంటూ మళ్లీ హైదరాబాద్ చౌరాస్తాలో రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఎ డ్మ సత్యం అక్కడికి చేరుకొని రైతులకు మద్దతు తెలుపగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే కల్వకుర్తి డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకోగా రైతులు ప్రభుత్వం, వ్యాపారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మార్కెట్ కార్యదర్శి వ్యాపారులకు తొత్తుగా పనిచేస్తున్నాడని మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా గంట పాటు రాస్తారోకో కొనసాగింది. చెప్పేది వినకుండా మొండికేస్తే.. ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కేసు లు నమోదు చేస్తామని.. గిట్టుబాటు ధర కావాలంటే వ్యాపారులతో మాట్లాడాలి.. అందుకు మేం సహకరిస్తామని సీఐ చెప్పి రైతులను మార్కెట్ యార్డులోకి తీసుకెళ్లారు. కొంతమంది రైతులు, వ్యాపారులు, మార్కెట్ కార్యదర్శితో మద్దతు ధర విషయమై మాట్లాడుతు న్నా.. మిగతా రైతులు మాత్రం మార్కె ట్ కార్యాలయం ఎదుట తమ ఆందోళనను కొనసాగించారు.
చారకొండ మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు దాదాపు 100 కింటాళ్ల వేరుశనగను మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఒకే చోట పోయడానికి వీలులేక మూడు చోట్ల కుప్పలు పోశాడు. దీంతో వ్యాపారులు సైతం శ్రీనివాసులు తీసుకొచ్చిన వేరుశనగకు మూడు కుప్పలకు మూడు రకాలుగా ధర నిర్ణయిస్తూ టెండర్ వేశారు. ఒక కుప్పకు రూ.6,216, రెండో కుప్పకు రూ.5,215, మూడో కుప్పకు రూ.5,075గా ధర నిర్ణయించడంతో రైతు ఆశ్యర్యపోయాడు. ఒక పొలంలో ఒకే విత్తనంతో సాగుచేయగా వచ్చిన దిగుబడికి మూడు రకాల ధరలేంటని ఆందోళనకు దిగాడు. ఇందులో మోసం ఉందంటూ వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా రైతులకు సైతం ధర విషయంలో ఇలాగే జరుగడంతో ఆందోళన మొదలైంది. మార్కెట్‌కు వేరుశనగ ఎక్కువ వస్తుండడంతో వ్యాపారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మార్కెట్ కార్యదర్శి వ్యాపారులతో కలిశాడని, ఫలితంగానే నెల వ్యవధిలో రూ.2వేల వరకు ధర తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీల కూలి తగ్గదు, వ్యాపారుల కమీషన్ తగ్గదు కానీ.. పంటకు మాత్రం ధర ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు.
రాత్రి 8 గంటలకు వ్యాపారులతో చర్చలు జరగగా.. రైతులు ఆందోళన విరమించారు. టెండర్లలో వచ్చిన కనిష్ఠ ధరకు అదనంగా రూ.400, మధ్యస్త ధరకు రూ.150, గరిష్ఠ ధరకు రూ.75 ఎక్కువ చెల్లిస్తామని వ్యాపారులు చెప్పడంతో రై తులు అసంతృప్తితోనే ఒప్పుకొన్నారు. అయితే, ధర విషయంలో వ్యాపారులు సానుకూలంగా ఉ న్నారని మార్కెట్ అధికారులు మైక్‌లో ప్రకటించి న కొద్దిసేపటికే కథ మళ్లీ మొదటికొచ్చింది. పెంచి న ధరలను మార్కెట్ అధికారులు టెండర్ ఆన్లైన్లో నమోదు చేయాలని వ్యాపారులు అనడంతో పరిస్థితి మొదటికొచ్చింది. అధికారులు ప్రకటించి న అదనపు ధరలు ఆన్లైన్లో నమోదు చేస్తే.. ఆ ధరను మార్కెట్ శాఖ ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా జరిగే పని కాదు. కాగా, సోమవారం మార్కెట్లో ఉన్న వేరుశనగకు మళ్లీ టెండర్ వేయాల్సిందే. ఇది లా ఉంటే రైతులు మాత్రం వేరుశనగ కుప్పల వద్ద దుప్పట్లు కప్పుకొని కాపలా కాస్తున్నారు.