పాలమూరు, నవంబర్ 3 : మహబూబ్నగర్ రూరల్ మండలం అప్పాయపల్లి గ్రామ పరిధిలో ఉన్న శ్రీబాలాజీ కాటన్ మిల్కు రైతులు సోమవారం పెద్ద మొత్తంలో వాహనాల్లో పత్తిని విక్రయించడానికి తీసుకువచ్చారు. తీరా అక్కడికి వచ్చిన రైతులకు అధికారులు ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఆగ్రహించిన రైతు లు మహబూబ్నగర్- రాయిచూర్ రో డ్డుపై వాహనాలు అడ్డంగా పెట్టి, బైఠాయించి రాస్తారోకోకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు తమ పత్తిని మొత్తం కొనుగోలు చేయాల ని నినాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప క్ష చూపుతున్న వివక్షను మానుకోవాలని ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు పండించిన ప్రతిగింజనూ కొంటామని చెప్పి రైతులను మోసం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఇప్పటికై నా పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకొని రైతు లు పండించిన పత్తిని మొత్తం కొనుగోలు చే యాలని డిమాండ్ చేశారు. రైతుల రాస్తారోకోతో ట్రాఫిక్ మన్యంకొండ వరకు ని లిచిపోయింది. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పడంతో రైతులు శాంతించా రు. వివిధ గ్రామాలకు చెం దిన పత్తి రైతులు పాల్గొన్నారు.