గద్వాల, జూన్ 5 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దం టూ చేపట్టిన నిరసనలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పోలీసులు, కంపెనీ యాజమాన్యం కవ్వింపు చర్యలతో రైతులు ఆగ్రహం కట్టలు తెంచుకొని దాడులకు తెగబడినట్లు తెలిస్తోంది. శాంతియుతంగా నిరాహార దీక్ష లు చేపట్టిన సమయంలో రై తులను తీయని మాటలతో ప్రజాప్రతినిధులు బోల్తాకొట్టించారు.
కంపెనీ ఏ ర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని చెప్పిన ప్ర జాప్రతినిధులు కర్షకులను న మ్మించి తడిగుడ్డతో గొ ంతుకోసే ప్రయత్నం చేశారు. దీనికంతటికి మాజీ ఎమ్మెల్యే కారణంగా తెలుసుకొని ఆయన తీరుతో మొదటికే ముపు వచ్చే అవకాశం ఉన్నదని భావించి 12 గ్రా మాల ప్రజలు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. భయంతో కంపెనీ యాజమాన్యం అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. దీంతో ప్రస్తుతానికి సమస్య స ద్దుమణిగింది. అయితే ఇథనాల్ కంపెనీ వెనుక అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నట్లు గ్రామస్తులు బహిరంగగానే ఆరోపిస్తున్నారు.
ఆ మాజీ ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో తన అనుచరుల ద్వారా కంపెనీ గురించి రైతులు, ప్రజలు ఏం చర్చించుకుంటున్నారో? తెలుసుకొన్నారు. సమస్య సద్దుమణిగిందని భావించి బౌన్సర్లు, భారీ పోలీస్ బందోబస్తుతో పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయం తెలుసుకొన్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఆ నేత పని పట్టే పనిలో ఉన్నారు. సదరు నేత ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తన అనుచరులతో కంపెనీ దగ్గరకు ఎవరైనా వెళితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారని జోరుగా ప్రచారం చేయించారు.
దీనికి తోడు మండలానికి చెందిన పోలీస్ అధికారితో ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులతో మాట్లాడించారు. కంపెనీ జోలికొస్తే మీ సంగతి చూస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే, పోలీసుల అండ చూసుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం పనులు ప్రారంభించడానికి పూనుకోవడంతో ఆగ్రహించిన రైతులు కంపెనీ ఆస్తులను ధ్వంసం చేశారు.
ఇది ఆ ఎమ్మెల్యేకు రుచించలేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఫ్యాక్టరీ పనులు జరగాలి.. అడ్డొచ్చే ప్రజలు, రైతులపై కేసులు నమోదు చేయాలని పోలీస్ ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయొద్దని తాము మొత్తుకుంటున్నా.. పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేయడంతోపాటు కంపెనీ నిర్మించే ప్రాంతానికి బౌ న్సర్లను తీసుకురావడంతో రైతులు కన్నెర్ర చేశారు. యాజమాన్యంపై తిరగబడడం తో వారు అక్కడి నుంచి మూట, ముళ్ల సర్దుకొని వెళ్లిపోయారు.
క్యాంపు ఖాళీ..
పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టే ఇథనాలు ఫ్యాక్టరీ వద్దని చెప్పినా అధికార పార్టీ నేతల అండదండలతో పను లు ప్రారంభించడానికి బుధవారం యాజమాన్యం సిద్ధమైంది. కోపోద్రిక్తులైన ఆయా గ్రామాల ప్రజలు అక్కడ తాత్కాలికంగా ఏర్పా టు చేసిన షెడ్లు, వాహనాలు, కంటైనర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడులతో కంపెనీ యాజమాన్యం వెనక్కు తగ్గింది. అక్కడి క్యాంప్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయింది. రాత్రి అక్కడ ఉన్న హిటాచీలు, ధ్వంసమైన వాహనాలను తరలించారు. ప్రస్తుతం అక్కడ దగ్ధమైన కంటైనర్, తాత్కాలిక షెడ్లే క్యాంపు ఖాళీ చేశాడనడానికి నిదర్శనం. దీంతో ప్రజలు ఊపిరిపీల్చుకొని ప్రశాంతగా ఉన్నారు. మళ్లీ కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నిస్తే తమ ప్రాణాలు అడ్డు పెట్టి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ప్రజలు హెచ్చరించారు.
ఫ్యాక్టరీ వద్దంటే లాఠీలతో కొడ్తారా..?
మా ప్రాణాలకు ముప్పుతెచ్చే.. మా పంటలను నాశనం చేసే ఇథనాలు ఫ్యాక్టరీ మాకొద్దంటే మాపై దాడులు చేసి.. అక్రమంగా కేసులు నమోదు చేస్తారా ? అని పోలీసులు, కంపెనీ యాజమాన్యాన్ని పెద్దధన్వాడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని బలవంతగా లాక్కొని వెళ్లి లాఠీలతో కొట్టడం వల్ల తామంతా భయబ్రాంతులకు గురైనట్లు ‘నమస్తే తెలంగాణ’తో గోడు వెల్లబోసుకున్నారు. తమను రెచ్చగొట్టడానికి కంపెనీ పనులు ప్రారంభిస్తే వారిని వదిలిపెట్టి వారిపై కేసులు నమోదు చేయకుండా.. తమపై కేసులు పెట్టడం ఏమిటని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాము ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే తమపై లాఠీలు ఎత్తడం ఏమిటని వారు ప్రశ్నించారు.