పెబ్బేరు, ఆగస్టు 17 : కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు పంట రుణమాఫీ వర్తింపజేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. సర్కారు నిర్దేశించిన గడువులోగా తీసుకున్న క్రాప్లోన్లు మాఫీ కాకపోవడంతో శనివారం పెబ్బేరు మండలం గుమ్మడం రైతులు నిరసన తెలిపారు. గ్రామంలోని రైతు వేదిక వద్ద ధర్నా చేపట్టి ఏఈవో ప్రశాంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం రూ.2 లక్షల రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న తమకు మాత్రం కాలేదన్నారు.
ఏ ప్రాతిపదికన మాఫీ చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయా రు. పెద్ద ఎత్తున మాఫీ చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నా.. ఆచరణలో మాత్రం కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు రైతులు ది క్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపా రు. తిరకాసు నిబంధనలు ఎత్తేసి అందరికీ చేయాల ని డిమాండ్ చేశారు. అనంతరం రైతు సంఘం జిల్లా నేత వెంకటస్వామి మాట్లాడుతూ మూడో విడుత రు ణ మాఫీలో చాలా మంది పేర్లు రాలేదన్నారు.
రేషన్ కార్డుకు సంబంధం లేకుండా మాఫీ ఉంటుందని గ తంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం గా ఉందన్నారు. మాఫీ కాక ఆయా బ్యాంకుల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ వెంటనే స్పందించి అర్హులకు మాఫీ వర్తింపజేయాలని, లేకుంటే రైతులతో కలి సి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో రైతులు ఆంజనేయులు, సత్యంయాద వ్, శ్రీనివాసులు, నాగేశ్, కిషన్‌నాయక్, రవీందర్‌నాయక్, కృష్ణయ్య, బాబు, రాజు తదితరులున్నారు.