గద్వాల, ఆగస్టు 25 : జిల్లాలోని రై తులకు రుణమా ఫీ బాధలు తప్పడం లేదు. జిల్లాలోని రైతులకు అటు రుణమాఫీ కాకపోవడంతోపాటు ప్రభుత్వం వానకాలం పంటలు సాగుకు అందజేసే పెట్టుబడి సాయం అం దక రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లా తయారైంది. సీఎం రేవంత్ తీరు అధికారంలోకి రాక ముందు ఒకలా వచ్చిన తర్వాత మరొకలా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా అర్హులందరికీ రుణమాఫీ చేయడంతోపాటు ఆగస్టు నాటికి వానకాలం సాగుకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలో జమ చేయడంతో సాగు పనులు చకాచకా కొనసాగేవి.
ప్ర స్తుత ప్రభుత్వం రుణమాఫీ అరకొర చేయడంతోపాటు రైతు భరోసాపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం దళారుల వద్ద చేయి చాపాల్సిన పరిస్థితి నెలకొన్నది. రుణమాఫీ రైతుల పాలిట యమపాశంగా మారింది. జిల్లాలో మూడు విడుతల్లో 95,199 మంది రైతులకు రుణమాఫీ కా వాల్సి ఉండగా ప్రస్తుతం 51,188 మంది రైతులకు రూ.440 కోట్లు మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. ఇంకా 44,011 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉన్నది.
అయితే బ్యాంకు అధికారుల పొరపాట్లతో కొం తమంది అర్హులు కూడా రుణమాఫీ పొందలేక పో యారు. రైతులు రూ.రెండులక్షల లోపు రుణాలు తీసుకొని వడ్డీకట్టి రెన్యువల్ చేసుకున్నారు. అయితే బ్యాం క్ అధికారులు కట్టిన వడ్డీని రుణమాఫీలో చూయించకపోవడంతో ప్రస్తుతం ఆ రైతులకు రుణమాఫీ కా వడం లేదు. అధికారులు చేసిన పొరపాట్లకు తమకు మాఫీ కాకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన చెందుతూ బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేస్తున్నారు. అర్హులుగా ఉండి రుణమాఫీ కాని రైతులు జిల్లాలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
జిల్లా కేంద్రంలోని యూ నియన్ బ్యాంక్‌లో నాపేరు మీద రూ.లక్షా50వేలు, నా భార్య మాణిక్యమ్మ పేరు మీద రూ.లక్షా30వేల రుణం తీసుకున్నాము. ప్రభుత్వం విడుదల చేసిన రూ.2లక్షల రుణమాఫీ మూడో విడుత జాబితాలో మా పేర్లు రాలేదు. రూ.2లక్షలకు పైగా ఉన్న రూ.80వేలు బ్యాంక్‌లో జమచేస్తాను రుణమాఫీ వర్తించేలా చూడాలని బ్యాంక్ అధికారులను కోరినా సరైనా సమాధానం చెప్పడం లేదు. ముందు డబ్బులు జమ చేయండి రుణమాఫీ అయినప్పుడు అవుతుందనే సమాధానం చెబుతున్నారు.
– కుమ్మరి గోవింద్, రైతు, లత్తీపురం, గద్వాల మండలం
గద్వాల యూనియన్ బ్యాంక్‌లో నా పేరు మీద రూ.85వేలు, నా భార్య మ ణెమ్మ పేరు మీద రూ.1.25 లక్షల రు ణం తీసుకున్నాం. రూ.2 లక్షల పైన ఉన్న డబ్బులు చెల్లిస్తేనే మాఫీ అవుతుందని బ్యాంకోళ్లు చెబుతున్నారు. కాంగ్రెసోళ్లు ఎ న్నికల సమయంలో ఇవేవీ చెప్పలేదు. నిబంధనల సాకుతో రైతులను మోసం చే యడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. మొదట రూ.2 లక్షల మాఫీ చేయా లి. లేకుంటే మాఫీ కాని వారందరం ఆందోళనకు దిగుతాం.
– గడ్డంరాములు, రైతు, బీరెల్లి, గద్వాల మండలం
నేను ధన్వాడ యూనియన్ బ్యాంక్‌లో పంట రుణం రూ.1,53,000 తీసుకు న్నా. రెగ్యులర్‌గా రెన్యూవల్ చేస్తూ వచ్చాను. అయినా నాకు మాఫీ కాలేదు. ఈ విషయమై బ్యాంక్, వ్యవసాయశాఖ అధికారులను అడిగితే రేషన్‌కార్డు లేనందుకు మాఫీ కాలేదని చావు కబురు చల్ల గా చెబుతున్నరు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ కొర్రీలు పెట్టి రైతుల కడుపుకొట్టడం బాధాకరం.
– నారాయణరెడ్డి, గోటూర్, ధన్వాడ మండలం, నారాయణపేట జిల్లా