అమరచింత, ఏప్రిల్ 16 : ఆత్మకూర్ మండలంలోని జూరాల, గుంటిపల్లి, మోట్లంపల్లి, ఆరెపల్లి, కత్తెపల్లి తదితర గ్రామాల రైతుల పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే జూరాల ఎడుమ కాల్వ ద్వారా డీ-6 కెనాల్ సాగునీరు విడుదల చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవికుమార్యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆత్మకూర్ తాసీల్దార్ కార్యాల యం ఎదుట రోడ్డుపై అరగంటపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రవికుమార్యాదవ్ మాట్లాడుతూ ప్రాజెక్టులో నీళ్లు పుష్కలం గా ఉన్నప్పడు ప్రజాప్రతినిధులు, అధికారు లు అవగాహన లేకుండా ఇతర ప్రాంతాలకు తరలించి ఇప్పుడు కాల్వ సమీపంలో ఉన్న రై తులకు సాగునీరు విడుదల చేయకుండా ఇ బ్బందులు కలిగిస్తున్నరని మండిపడ్డారు. యాసంగి పంట సాగు చేసిన రైతులకు ఏప్రిల్ చివరి వరకు సాగునీటిని విడుదల చేస్తామని చెప్పి చివరికి నిండాముంచారని ఆరోపించా రు.
ఇప్పటికైనా సర్కారు కళ్లు తెరిచి సాగునీ రు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కో రారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. కా ర్యక్రమంలో ఆత్మకూర్ మాజీ ఎంపీపీ విరేశలింగం, మాజీ కౌన్సిలర్ రామకృష్ణ, కో ఆప్షన్ సభ్యుడు రియాజ్అలీ, బీఆర్ఎస్ నాయకులు మాసన్న, ఆనంద్, లక్ష్మణ్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.