వనపర్తి, మార్చి (నమస్తే తెలంగాణ) 25 : వ్యవసాయ పొలాలకు లోఓల్టేజీ లేకుండా నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేయాలని నాచహళ్లి సబ్‌స్టేషన్ పరిధిలోని రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి మండలం నాచహళ్లి, సవాయిగూడెం, పెద్దగూడెం, పెద్దగూడెంతండాలకు చెందిన రైతులు నాచహళ్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రీఫేజ్ కరెంటు సక్రమంగా లేకపోవడం వల్ల యాసంగిలో సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ అధికారులకు పలు మార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు ఎలాంటి కరెంట్ సమస్యలు లేకుం డా పంటలు పండించుకున్నామని, కాంగ్రెస్ రాగానే కరెం ట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. 20 రోజుల పాటు నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేస్తే పంట లు చేతికొస్తాయని విద్యుత్ అధికారులు స్పందించి నాణ్యమైన కరెంట్‌ను అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఈ చంద్రశేఖర్‌కు రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ సక్రమంగానే ఇస్తున్నామన్నారు.
గతంలో రాత్రి 1:43 నిమిషాల నుంచి త్రీఫేజ్ లైన్ ఇచ్చే వాళ్లమని, రైతుల విజ్ఙప్తి మేరకు ఈరోజు నుంచి సాయం త్రం 6 గంటల వరకు త్రీఫేజ్ కరెంటు ఇచ్చి రైతులను ఆదుకుంటామన్నారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్మనాయక్, మాణక్యం, నరేశ్‌కుమార్, మాధవరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, కృష్ణనాయక్, రూప్లా నాయక్, కొండన్న తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ అంతరాయంపై గుమ్మడం రైతుల ఆగ్రహం
పెబ్బేరు, మార్చి 25 : పెబ్బేరు మండలంలోని గుమ్మ డం 33/11కేవీ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌లో తరచూ అంతరాయం ఏర్పడుతుండటంతో విసిగిన రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్‌లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇటీవల మరమ్మతులకు గురైంది. దీంతో గత మూడు రోజులుగా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసి నా అధికారులు పట్టించుకోకపోవడంతో గుమ్మడం, తిప్పాయిపల్లెకు చెందిన పలువురు రైతులు సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. నీళ్లు లేక ఎండిన వరి పైరును చూపెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ట్రాన్స్ఫార్మర్ను రిపేరు చేయించి పంటల సాగుకు నీరందించాలని పంటలు కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ విష యం ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి వెళ్లడంతో రెండు రోజుల్లో విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.