పాన్గల్, నవంబర్ 7 : కేంద్ర ప్రభుత్వం నాబార్డు సహకారంతో రైతులకు వందశాతం సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ విత్తనాల్లో గందరగోళం నెలకొన్నది. ఇటీవల పంపిణీ చేసి న వేరుశనగ విత్తనాల్లో అర్హులైన రైతులకు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు సిఫార్స్ చేసి న వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలకు తావిస్తున్నాయి. చిన్న, సన్నకారు రైతు ల్లో వేరుశనగ పంటను సాగుచేసే వారిని గుర్తిం చి విత్తనాలు పంపిణీ చేయాలనే అదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత వ్యవసాయ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
గ్రామసభల ద్వారా అర్హులైన రైతులను ఎంపిక చేయకపోవడం వల్ల ఎవరంతకు వారు ఉచిత వేరుశనగ విత్తనాల కోసం ఇటీవల వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతులు బారులుతీరారు. అంతేకాకుండా ప్రధానరోడ్లపై రైతులు ధర్నా, రాస్తారోకోలు చేపట్టారు. మండలానికి ఎన్ఎంఈఎస్ పథకం ద్వారా వందశాతం సబ్సిడీపై 1,256 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు మంజూరయ్యాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారు లు రెండు విడతలుగా 1,369 మంది రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. విత్తనాల పంపిణీ పూర్తయ్యిందని అధికారులు సెలవిస్తున్నారు.
అయినప్పటికీ ఇంకా విత్తనాల కోసం అనేక మంది రైతులు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గ్రామాలవారీగా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన రైతుల లిస్టును బహిర్గతం చేయడంలో వ్యవసాయ అధికారులు జం కుతున్నారు. లబ్ధిదారుల లిస్టు ప్రకటించడంలో అధికారులు తాత్సారం చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన రైతులను ఎంపిక చేయడంలో పారదర్శకత లోపించడం వల్లే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తున్నది.