ఊటూర్, ఆగస్టు 13 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టులు భూములు కో ల్పోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊటూర్ మం డలం ఎడవెల్లి గ్రామం నుంచి చిన్నపొర్ల, పెద్దపొర్ల గ్రామాల మీదుగా మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర ని ర్వహించారు. ఆయా గ్రామాల్లో భూనిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల కు వివరించారు.
పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాలని కోరారు. జిల్లా భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర ను బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామోజీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రైతుల పాదయాత్ర ఉద్దేశించి అఖిలపక్ష పార్టీల నేతలు సత్య యాదవ్, భాసర్, వెంకట్రామారెడ్డి, గోపాల్, సలీంలు మద్దతు తెలిపారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ భూ నిర్వాసితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశా రు.
30 రోజులుగా ప్రాజెక్టులు భూములు కో ల్పోయిన రైతులు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రైతుల గోడును పట్టించుకోవడంలేదని విమర్శించా రు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల త్యాగాలను గుర్తించి ఎకరాకు రూ.60 లక్షల పరిహారం అందించాలని, ని ర్వాసిత కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉ ద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. సీఎం రేవంత్ స్పందించి మరో లగచర్లను తలపించక ముందే భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిషరించాలని లేని పక్షంలో కలెక్టరేట్‌తో పాటు అసెంబ్లీని సైతం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.
పాదయాత్రలో భాగంగా రైతులు స్థాని క చెక్‌పోస్ట్ నుంచి పట్టణంలో ఎడ్లబండ్ల ర్యా లీ నిర్వహించారు. అనంతరం ఎడ్లబండ్లతో కా ర్యాలయాన్ని తాసీల్దార్ దిగ్బంధించారు. అ నంతరం భూ నిర్వాసితుల సమస్యల పరిషారం కోసం డిప్యూటీ తాసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మరాజుగౌ డ్, గోపాల్‌రెడ్డి, శెట్టి రమేశ్, మశ్చేందర్, అఖిలపక్ష పార్టీల నాయకులు దొబ్బలి హనుమం తు, రఘువీర్కిరణ్, ఆంజనేయులుగౌడ్, తరుణ్, షేక్ షమీ, రాఘవేందర్‌గౌడ్, అనిల్, మల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.