మద్దూర్, మే 4 : అన్నదాతలపై కాంగ్రెస్ స ర్కారు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నది.. వ్య యప్రయాసాల కోర్చి పంటలను సాగు చేసి.. అకాలవర్షాలకు కంటిమీద కునుకులేకుండా కాపాడుకున్న ధాన్యాన్ని అమ్ముకుందామంటే ముప్పుతిప్ప లు పెడుతున్నారు. గన్నీ బ్యాగులు ఇవ్వడంలో నిర్ల క్ష్యం.. కొనుగోలు కేంద్రాల్లో తరుగు.. తీరా కొనుగోలు చేశాక మిల్లర్లు వడ్డు దింపుకోవడంలో తాత్సా రం చేస్తూ రైతుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. రైస్‌మిల్లు యజమానులు దొడ్డు రకం ధాన్యాన్ని దింపుకోవడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మద్దూరు మండల కేంద్రంలోని పెద్దిపహాడ్ రోడ్డు లో ఉన్న పద్మావతి రైస్‌మిల్లు వద్ద ఆదివారం రైతు లు ఆందోళన చేపట్టారు.
వడ్లను ఆరబెట్టి కొనుగో లు చేయడం నుంచి వడ్లు లారీలకు ఎత్తే వరకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రై తుల నిరసనకు బీఆర్ఎస్, వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు వంచర్ల గోపాల్ మాట్లాడుతూ కాం గ్రెస్ ప్రజల ప్రభుత్వమని గొప్పలు చెబుతూ రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. సీఎం సొంత నియోజకవర్గంలో రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం, అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ట్రాక్టర్లతో రైతులతోపాటు ప్రధాన రోడ్లపై బైఠాయించి ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
కేసీఆర్ సర్కారులో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చాక రైతులను పట్టించుకునే నాథుడే క రువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనా స్థలానికి సివిల్ సప్లయ్ డీటీ ఆనంద్ చేరుకొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీటీ పై రైతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఖర్చులతో ట్రాక్టర్లను అద్దెకు తీసుకొచ్చామని, వర్షం వచ్చి ధాన్యం తడిసి అనేక అవస్థలు పడుతున్నామని వా పోయారు. ఇందుకు డీటీ సమాధానమిస్తూ.. రైతులకు నష్టం జరగకుండా ధాన్యం దింపిస్తామన్నారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.