కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి, ఆగస్టు 24 : రుణమాఫీ.. దేశానికి అన్నం పెట్టే రైతుల కుటుంబాల్లో చిచ్చుపెట్టిం ది. కొల్లాపూర్ నియోజకవర్గంలో రణరంగంగా మా రింది. అర్హత ఉండీ మాఫీ కాకపోవడంతో రైతుల కు టుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నది. దీంతో బ్యాంక్, వ్యవసాయశాఖ అధికారుల మధ్య రైతులు నలిగిపోతున్నారు. అంతేకాకుండా తీసుకున్న రుణం పై వడ్డీ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీం తో ఈ నిబంధనలన్నీ ముందే చెప్పి ఉంటే వడ్డీ కట్టి మొత్తం మాఫీ అయ్యేలా చూసుకునేవారమని, ఇప్పు డు వడ్డీ భారం మోపుతున్నారని పెద్దకొత్తపల్లి మండ లం చంద్రకల్ రైతులు వాపోతున్నారు.
అధికారం కోసం ఎన్నికల సమయంలో ఇష్టానుసారం హామీలి చ్చి నేడు వాటికి కొర్రీలు పెట్టి అర్హులకు అన్యాయం చేయడం తగదన్నారు. గ్రామంలో 1,500 మంది రై తులు ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీలోగా రుణం తీసుకున్నారు. ఇందులో కేవలం 700 మందికి మా త్రమే మూడు విడుతల్లో మాఫీ అయ్యింది. మిగిలిన వారికి అవుతుందో లేదో తెలియక బ్యాంకులు, ఏఈ వోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రుణమాఫీ కానీ రైతుల పరిస్థితి ఘోరంగా మారింది. కేవలం మాటలకే తప్పా చేతల ప్రభుత్వం కాదని రైతులు అక్కసు వెళ్లగక్కుతున్నారు.
నా పేరున ఉన్న మూడెకరాలకు బ్యాంక్‌లో రూ.30వేలు పంట రుణం తీసుకున్నా. ఎందుకు మాఫీ కాలేదో అర్థం కావడం లేదు. మూడు విడుతల్లో మాఫీ అవుతుందోమోనని ఆశగా ఎదురుచూశాను. లక్షలు తీసుకున్న వారికి మాఫీ అయ్యింది. మాలాంటి పేద రైతుల కడుపుకొట్టారు. ఇలాంటి దిక్కుమాలిన పాలన వచ్చినందుకు సిగ్గుపడుతున్నాం.
– ఆంజనేయులు, చంద్రకల్ గ్రామం, పెద్దకొత్తపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. రూ.లక్షా 80 వేల క్రాప్ లోన్ తీసుకున్నా. ఏ లిస్టులో కూడా నా పేరు రాలే. ఎందుకని బ్యాంకోళ్లు, అ గ్రికల్చర్ ఆఫీసర్లను అడిగితే ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు. రుణమాఫీ గందరగోళంగా చేశారు. ఓడ లో ఉన్నంత వరకు ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది.
– బండి రవి, చంద్రకల్ గ్రామం, పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా
నాకున్న నాలుగు ఎకరాల భూమిపై రూ.లక్షా 30వేల క్రాప్ లోన్ తీసుకున్నా. మూడు సార్లు వచ్చిన లిస్టులల్ల నా పేరు లేదు. ఎందుకు రాలేదని అధికారుల వద్ద కు వెళ్లి అడిగితే డొంక తిరుగుతు సమాధానాలిస్తూ చావు కబురు చల్లగా చెబుతున్నారు. మాఫీ విషయం ఇక ఎవరిని అడగాలో తెలియడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సకాలంలో రైతుబంధు వచ్చేది. కాంగ్రెస్ సర్కారు వచ్చినంక రైతుభరోసాకు ఎగనామం పెట్టారు. రైతులను మోసం చేసే ఏ ప్రభుత్వం కూడా ఎక్కువకాలం ఉండదు.
– స్వామి, చంద్రకల్ గ్రామం, పెద్దకొత్తపల్లి మండలం
ఎన్నికలప్పుడు షరతులు లేకుండా రుణమాఫీ చే స్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పడు రేషన్‌కార్డు లే దని, పేర్లు తప్పులున్నాయని అధికారులు పొంతన లేని మాటలు చెబుతున్నారు. నాకు, మా నాన్నకు కలిపి రూ.2.10లక్షల వ్యవసాయం పంట రుణం తీసుకున్నాం. మూడు విడుతల్లో ఇప్పటికీ ఒక్క పైసా కూడా మాఫీ కాలేదు. నమ్మిన రైతును హస్తం పార్టీ నిలువునా మోసం చేసింది.
– లాల్‌సింగ్ నాయక్, రైతు, కేస్లీతండా, వెల్దండ మండలం
నేను రూ.2లక్షల పంట రుణం తీసుకున్నా. మూడు విడుతల్లో మాఫీ చేసినా నా పేరు ఏ లిస్టులోనూ రాలేదు. ఎందుకని వ్యవసాయ, బ్యాంక్ అధికారులను అడిగితే వివరాల్లో తప్పులున్నాయని చెబుతున్నారు. తప్పులుంటే రుణం ఎట్లా ఇచ్చారో అర్థమైతలేదు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ప్రజా ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పడం తప్పా చేసిందేమీ లేదు.
– చిల్వేర్ వెంకటయ్యగౌడ్, కొట్ర,గ్రామం, వెల్దండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
సింధనూర్ ఏపీజీవీబీలో గతేడాది మా కుటుంబంలో ముగ్గురం రుణం తీసుకుంటే ఒక్కరికి కూడా మాఫీ కాలేదు. మూడు జాబితాల్లో మా పేర్లు లేవు. బ్యాంకోళ్లను అడిగితే తెల్వదంటున్నరు. అగ్రికల్చర్ ఆఫీసర్లను అడిగితే సర్కారు చెప్పినట్లు చేసినమంటున్నరు. ఎవరిని అడగాలో అర్థమైతలే. బోగస్ మాటలు చెప్పి రేవంత్ సర్కారు మోసం చేస్తున్నది. కేసీఆర్ పాలనలోనే బాగుండే.
– మహేశ్, రైతు, కొత్తపల్లి, అయిజ మండలం, గద్వాల జిల్లా
మల్దకల్ యూనియన్ బ్యాంకులో రూ.1.60 లక్షల రుణం తీసుకున్నా. ఏ లిస్టులో నా పేరు రాలేదు. ఏ లెక్కన రుణమాఫీ చేస్తున్నరో తెలుస్తలేదు. పంటరుణం ఇచ్చినప్పుడు లేని త ప్పులు రుణం మాఫీ చేసేటప్పుడు ఎట్లకెళ్లి వస్తున్న యి. రైతులను మోసం చేసినోళ్లు ఎవరూ బాగుపడరు. మా ఉసురు పోసుకుంటున్న కాంగ్రెసోళ్లకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నయి.
– మొహినుద్దీన్, రైతు, బైనపల్లి, అయిజ మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా