వీపనగండ్ల, మే 13 : ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోలులో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ మంగళవారం మండలకేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో చిక్కుకున్న తాసీల్దార్ వరలక్ష్మి వాహనాన్ని రైతులు అడ్డుకొని ధాన్యం కొనుగోళ్లపై నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల దగ్గర నిల్వచేసి నెలల తరబడి కాపాడు కోవడానికి అనేక ఇబ్బందులకు గు రికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో తేమశాతం పూర్తిగా తగ్గిపోతున్నదని వాపోయారు.
రైతులు నష్టపోవడం కోసం రైస్ మిల్లర్లు సంబంధిత అధికారులు కలిసి కా లయాపన చేస్తున్నారని, రైసు మిల్లర్లు తాలు పేరుతో 40 కేజీల బస్తాకు 3 కేజీలపైన తరుగు తీస్తూ దారుణంగా మోసాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యానికి సరిపడ గన్నీ బ్యాగులు సరఫరా చే యడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో మండలంలో ఇప్పటి వరకు కనీసం 20 శాతం కూ డా ధాన్యం కొను గోలు చేయలేదని రైతులు ఆరోపించారు. ఐకేపీతోపాటు గతంలో వలే తూంకుంట సిం గిల్విండో సొసైటీ ద్వారా కూడా ధాన్యాన్ని విక్రహిం చి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు శ్రీను, వెం కట్ రెడ్డి, సర్వారెడ్డి, ఊశన్న, సహాదేవుడు తదితరులు పాల్గొన్నారు.