కల్వకుర్తి, సెప్టెంబర్ 2 : కల్వకుర్తి ప్రాంతానికి సాగు నీరందించే కేఎల్ఐ 29వ ప్యాకేజీకి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేఎల్ఐ ప్రధాన కాల్వకు గండ్లు పడ్డాయి. వరద నీరు చెరువులోకి భారీగా చేరడంతో చెరువుకు కూడా గండ్లు పడ్డాయి. దీంతో చెరువు దిగువన ఉన్న రైతుల పంట పొలాలు నీటిలో మునిగి రైతులకు తీవ్రనష్టం వా టిల్లింది. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్వకుర్తి ప్రాంతానికి త్వరితగతిన కృష్ణా సాగునీరు ఇవ్వాలనే సదుద్దేశంతో కొన్ని చోట్ల తాత్కాలిక పద్ధతిన పనులు చేశారు.
ఆ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో 29వ ప్యాకే జీ కాల్వలో శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నవంబర్ 2023 నాటికి కాల్వలో నీళ్లు బంద్ అయ్యాయి. ప్రభు త్వం కాల్వకు సంబంధించి మరమ్మతు పనులు చేపట్టలేదు. తీరా వానకాలం ప్రారంభంలో పనులు ప్రారంభించింది. ఇంతలోనే కృష్ణానదికి వరదలు రావడం, క ల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ప్రధాన కాల్వలకు సాగునీరు ఇవ్వడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మూడు రో జులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో కాల్వలోకి ఏ ర్పాటు చేసిన ఇన్లెట్ల ద్వారా భారీగా వర్షం నీరు చేరింది. దీంతో తాత్కాలిక పద్ధతిన ఏర్పాటు చేసిన యూటీల వద్ద కేఎల్ఐ కాల్వకు భారీ గండ్లు పడ్డాయి. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ గ్రామం(కేఎల్ఐ 29వ ప్యాకేజీ 128వ కిలో మీటర్ వద్ద) కేఎల్ఐ కాల్వ కు యూటీ వద్ద గండి పడింది.
కాల్వలోని నీరు గండి ద్వారా లింగారెడ్డికుంట, మాచినేనికుంట నుంచి అలుగులు పారాయి. దీంతో పొలాలు కోతకు గురయ్యాయి. వరిపంట, పత్తి చేలు నీటమునగడమే కాకుండా రైతు లు పొలాలకు వెళ్లే బాటలు వరదనీటికి కొట్టుకుపోయా యి. కేవలం కాల్వ పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టకపోవడం వల్లనే భారీ నష్టం సంభవించిందని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న త మకు వరద మరింత నష్టం చేకూర్చిందని, ప్రభుత్వం మానవత్వంతో ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.