అమరచింత, ఆగస్టు 11 : యూరియా కోసం రైతులు తిండితిప్పలు వదిలి రాత్రి పగలు తేడా లేకుండా పీఏసీసీఎస్, ఆగ్రో రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. శుక్రవారం పీఏసీసీఎస్ వద్దకు వచ్చిన యూరియాను ఆధార్‌కార్డుపై రెండేసి చొప్పున పంపిణీ చేయగా, శనివారం రాఖీ పండుగ కావ డం, ఆదివారం సెలవు దినం రావడం తో సోమవారం తెల్లవారక ముందు నుం చే యూరియా కోసం రైతులు క్యూలో ని ల్చున్నారు.
అయితే యూరియా లోడ్ ఒకటే (కేవలం 450బస్తాలు) రావడం, రైతులు పెద్ద ఎత్తున ఉండడాన్ని గమనించిన పీఏసీసీఎస్ సిబ్బంది పోలీసులను పిలిపించి వారి పహారా మధ్య యూరి యా పంపిణీ చేపట్టారు. అప్పటికి చాలా మంది రైతులకు యూరియా దొరకక పోవడంతో తాము ఎన్ని రోజుల యూరి యా కోసం పనులు వదిలిపెట్టి తిరగాలని అదికారులతో వాగ్వాదానికి దిగారు. రై తులు ఆందోళన తెలుసుకున్న వ్యవసా య సంచాలకులు దామోదర్ అక్కడికి చే రుకొని ప్రతిరోజూ యూరియా లోడ్ వ స్తుందని, అందరికీ అందజేస్తామని చె ప్పారు. యూరియా అత్యవసరమైన రై తులు నానో యూరియాను వాడుకోవాలని అది కూడా పనిచేస్తుందని రైతులకు సూచించారు. రైతుల యూరి యా పంపిణీని పీఏసీసీఎస్ చైర్మన్ గాడి కృష్ణమూర్తి, సీఈవో నరేశ్‌లు పర్యవేక్షించారు.
వెల్దండ, ఆగస్టు 11 : రైతులకు యూ రియా కోసం మళ్లీ తిప్పలు మొదలయ్యాయి. గత పదేండ్లుగా బీఆర్ఎస్ హ యాంలో రైతులకు ఎలాంటి ఎరువులు, విత్తనాల కొరతలు లే కుండా వ్యవసా యం ఎంతో ఆనందంగా చేసుకున్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం రాగానే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అందులో భాగంగానే సోమవా రం వెల్దండ సింగిల్ విండో కార్యాలయం లో ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. మరో విష యం ఏమిటంటే గతంలో సన్న యురి యా పంపిణీ చేసేవారని ఇప్పుడు సన్నా యూరియా ఇవ్వకుండా దొడ్డు యూరియాతోనే సరిపెడుతు న్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు దొడ్డు యూరియాతోపాటు సన్నా యూ రియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
భూత్పూర్, ఆగస్టు 11 : యూరియా కోసం రైతులు స్థానిక ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ఎగబడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంతో రైతులు తెల్లవారే సరికి యూ రియా కోసం తరలివచ్చారు. యూరియా కొరత ఉండడంతో అధికారులు చేసేదేమిలేక ఇప్పుడు వస్తుంది, అప్పుడు వస్తుం ది రైతులకు చెప్తున్నారు. రైతులు గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ యూ రియా కొరత ఏర్పడలేది అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు.