నాగర్‌కర్నూల్, జూలై 5 : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హె చ్చరించారు. కొల్లాపూర్ నియోజకవర్గం లో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేయకపోవడం, రైతుభరోసా సరిగా ఇవ్వకపోవడం వంటి రైతు సమస్యలపై శనివారం నాగర్‌కర్నూల్ కలెక్ట ర్ బదావత్ సంతోశ్‌కు బీరం రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యల ను సర్కారు, అధికారులు సై తం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతులకు అం దజేయాల్సిన ట్రాన్స్ఫార్మ ర్లు, మెటీరియల్ సబ్స్టేషన్లలో పెట్టుకొని ఇవ్వకుం డా ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు.
వేరుశనగ సాగుకు ఆలస్యమవుతుందని రైతులు మొరపెట్టుకున్నా ప ట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ట్రాన్స్ఫార్మర్లు మంజూరైనా ఎందుకు సబ్స్టేషన్లలో స్టోరేజ్ చేసుకున్నారని, వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కేసీఆర్ సర్కారులో రైతుల సంక్షేమానికి పాటుపడగా, కాంగ్రెస్ సర్కారు కన్నీళ్లు మిగులుస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా రైతులకు సరిగా కరెంటు ఇవ్వడం చేతకాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ట్రాన్స్ఫార్మర్లను సీనియార్టీ ప్రకారం ఇవ్వాలని, రాజకీయాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వం మెడలు వంచైనా రైతులందరికీ భరోసా ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మండలంలో రైతుభరోసా 2వేల మందికి సరిగా అందలేదని, నియోజకవర్గ పరిధిలో చూస్తే దాదాపు 5వేల మంది రైతులకు భరోసా అంతంత మాత్రంగానే అందిందన్నారు. రైతు భరోసా అందని వారికి శాటిలైట్ ఫిక్షర్స్ ఆధారంగా ఇస్తామనడం సరికాదన్నారు.
పదెకరాలు ఉన్న పెద్దరైతు ఉండి వ్యవసాయం చేసుకోనట్లయితే చుట్టుపక్కల అర, ఎకరం పొలం ఉన్న చిన్న, సన్నకారు రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు. పింఛన్ రూ.4వేలు ఇస్తామని ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన నాయకులు అధికారంలోకి వచ్చి ఏడాద్నిర పూర్తయినా, గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నా ఎందుకు పెంచి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.