రైతుబంధు సాయం రైతన్నల్లో సంబురాన్ని తీసుకొచ్చింది. యాసంగి సీజన్లో పంటల పెట్టుబడులకు చేయూతనందిస్తున్నది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ బృహత్తర పథకంతో వేలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. పదో విడుతలో ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని ఖాతాల్లో జమ చేస్తున్నది. మూడో రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.255 కోట్లు అందజేశారు. మొత్తం 3,11,173 మంది రైతులు లబ్ధిపొందారు. బ్యాంకుల్లో పడిన డబ్బు డ్రా చేసుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అంటూ సంబురాల్లో మునిగిపోయారు. మరింత ఉత్సాహంగా యాసంగి సీజన్లో పంటల సాగులో నిమగ్నమయ్యారు
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం రైతన్నల పాలిట కల్పతరువులా మారింది. రై తు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో పథకాలు అ మలుచేస్తున్నది. రైతుబీమా, రైతువేదిక, వ్యవసాయ కల్లాలు, 24 గంటల కరెంట్, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందిస్తున్నది. దీంతో రైతన్నలు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో బీడుబారి ముళ్లపొదలతో ఉన్న భూములు నేడు సిరులు కురిపి స్తున్నాయి. దీంతో వ్యవసాయేతర భూముల విలువలు రెట్టింపయ్యాయి. రైతన్నలు సంబురంగా సాగు చేపడుతున్నారు. 2018లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుం చి నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు 9 సార్లు వానకాలం, యాసంగి సీజన్లో రూ.2,800 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ సీజన్లో తాజాగా 3.8 లక్షల మందికి రూ.378 కోట్లు అందజేస్తున్నది. గుంట భూమి నుంచి మొదలుకొ ని రైతులకు రైతుబంధు నిధులను నేరుగా ఖాతాలోనే జమ చేస్తున్నది. తొలిరో జు జిల్లాలో 1.48 లక్షల మంది రైతులకు రూ.80.40 కోట్లను, రెండో రోజు 51 వేల మంది రైతులకు రూ.64.50 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమ చేశారు. మూడో రోజు 1,23,958 మంది రైతుల ఖాతాలో రూ.121.51 కోట్లు జమ చేయడం జరిగింది. కాగా జిల్లాలో కొత్తగా 16 వేల మంది రై తుబంధు కోసం అర్హులుగా ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తున్నది. ఈ రైతన్నలకు సైతం జనవరి 7వ తేదీ వరకు బ్యాంక్ పాస్ పుస్తకాలు అందజేస్తే రైతుబంధు పథకం వర్తించనున్నది. ప్రస్తుత సీజన్లో జిల్లాలో 2.22 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్న ట్లు అధికారుల అంచనా. ఇప్పటివరకు 50 శాతం మేర 1.5 లక్షల ఎకరాల వరకు సాగైనట్లు భావిస్తున్నారు. ఈ సీజన్లో అత్యధికం గా 1.40 లక్షల ఎకరాలో వరి, ఆ తర్వాతి స్థానంలో 1.19 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు చేపట్టనున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి భారంగా మారినా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నది. దీంతో సాగు దిగుబడి పెరుగుతున్నది.
ఈ సారి పైసలు పడ్డయ్.. వాటిని పెట్టుబడికి వాడుకుంటా. గతంలో ఇంటిల్లిపాది పనిచేసినా అప్పుకే సరిపోయేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం మీద పెట్టుబడి పెడితే అప్పులపాలై రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ తెలంగాణ వచ్చినాక, కేసీఆర్ సార్ రైతుల పక్షపాతిగా నిలబడడంతో మళ్లీ వ్యవసాయానికి జీవం వచ్చింది. ఫలితంగా ఎనిమిదేళ్ల కాలం నుంచి పంట పొలలసాగు గ్రామాల్లో పెరుగుతూ వస్తున్నది. మాకున్న పొలంలో అందరం కష్టపడుతున్నం. మొదటి నుంచి కేసీఆర్ పైసలు పడుతున్నయ్. మంచిగా ఉన్నది. కేసీఆర్ రైతులకు బాగా చేస్తుండు. పంటలు బాగా పండుతున్నయి. ముప్పై ఏండ్ల నుంచి ఎవుసం చేత్తున్నా. ఎవ్వరూ ఇలా పైసలు ఇయ్యలే.
– శ్రీను నాయక్, పాటిగడ్డ తండా, వనపర్తి జిల్లా
రైతులకు సీఎం కేసీఆర్ ఎంతో మంచి చే సిండు. మళ్లా అధికారంలోకి కేసీఆరే వత్త డు. ఆయనే రావాలే. వేరే వాళ్లు వస్తే రైతుబంధు రాదు. ఇప్పుడు వచ్చిన పైసలు పెట్టుబడికి సరిపోతాయి. అప్పులకు పోకుండా సాయం చేస్తున్నడు. గతంలో ఎవ్వ రూ పంటలు పండించుకోడానికి ఏ ప్రభుత్వమూ సా యం కింద డబ్బులు ఇవ్వలేదు. రైతుబంధు డబ్బులు పడగానే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తున్నది. బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకున్నాను. ఎరువులు, పురుగు మందులు తెచ్చుకుంటా. మాలాంటి వారి గురించి నిత్యం ఆలోచిస్తున్న బీఆర్ఎస్ సర్కార్ పాలనలో మంచిగ బతుకుతున్నం. సంబురంగా ఎవుసం చేస్తున్నా. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలే.సీఎం కేసీఆర్ సార్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం.
– శశికళ, కార్కొండ, నాగర్‌కర్నూల్ జిల్లా
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మా లాంటి రైతుల పాలిట దేవుడు. ఆయన పాలనలో రైతుల ముఖాల్లో సంతోషం కనబడుతున్నది. తెలంగాణ రాకముందు మాసోంటి చిన్న రైతులు వ్యవసాయం చేయాలంటే కష్టంగా ఉండేది. పంట పెటుబడులు ఉండకపోయేవి. ఆడా, ఈడా బాకీలు తెచ్చి పంటలు వేసెటోళ్లం. బాకీల కోసం నెలరోజులు తిరుగాల్సి వచ్చేది. రైతుబంధు పథకం మా కష్టాలను దూరం చేసింది. డబ్బులు ఖాతాలో జమకావడంతో ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ పైసలతో మందులు కొనుగోలు చేసేందుకు సాయపడుతాయి. రైతుబంధు ఇచ్చి కేసీఆర్ కొండంత ధైర్యం ఇసున్నడు. ఆయనను రైతులంతా కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి.
– ఎదెడ్ల బాలస్వామి, వెల్గొండ గ్రామం, నాగర్‌కర్నూల్ జిల్లా
సీఎం కేసీఆర్ రైతుల కు పెట్టుబడి కింద ఎకరా కు రూ.5 వేలు జమచేస్తున్నారు. ఏడాదికి రెండు పంటలకుగానూ ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నారు. దీంతో అప్పు కో సం సావుకార్ల చుట్టూ తిరిగే పని, ఒత్తిడి తగ్గింది. నాకు మూడు ఎకరాలు ఉన్నది. రూ.15 వేలు ఖాతాలో జమయ్యాయి. ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నాను. కాల్వ కింద నీళ్లు ఫుల్లుగా వస్తున్నాయి. పంటకు కరెంట్ కూడా ఉచితంగానే ఇస్తున్నారు. పంట చేతికి వచ్చాక సీఎం కేసీఆర్ కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నారు. ఇది మాములు విషయం కాదు. కేవలం కష్టం మాత్రమే మాది. మా కష్టానికి భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి దొరకడం మా అదృష్టం. రైతుబంధు పథకం కింద సాయం చేయడంతో నాలాంటి రైతులకు ఎంతో చేదోడు.. వాదోడుగా నిలిచింది. కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.. సాయం పడడంతో సంతోషంగా ఉన్నది.
– గోపాల్‌రెడ్డి, రైతు, వెంకటాపురం, కేటీదొడ్డి మండలం